అక్కినేని కుటుంబం గురించి మాట్లాడితే, చైతన్య–అఖిల్ ఇద్దరి స్వభావం, ఆలోచనల్లో ఎంత తేడా ఉందో అందరికీ తెలుసు. కానీ ఈ తేడాను మొదటిసారి ఓపెన్‌గా వివరిస్తూ అమల ఆక్కినేని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్ టీవి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల చై.. అఖిల్ గురించి చాలా విషయాలు పంచుకుంది.
Also Read :Priyanka Mohan ; భారీ ప్రాజెక్ట్‌తో.. కన్నడకు రీఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్
అమల మాట్లాడుతూ.. చైతన్య చిన్నప్పటి నుంచే చాలా కామ్, డిసిప్లిన్‌డ్ వ్యక్తి. చిన్ననాటి చెన్నైలో గడిపి, కాలేజ్ టైంలో హైదరాబాద్‌కి రావడంతో జీవితం మీద క్లారిటీ చాలా చిన్న వయస్సులోనే వచ్చింది. ఏది కరెక్ట్, ఏది రాంగ్ తనకు బాగా తెలుసు. ఎవరితోనైనా అమర్యాదగా మాట్లాడడు, కోపం తెచ్చుకునే స్వభావం అస్సలు లేదు. ఒక మాట మాట్లాడితే మర్యాదపూర్వకంగానే ఉంటుంది. ముఖ్యంగా తండ్రి నాగార్జున మాటకు చాలా విలువ ఇస్తాడు, ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటాడు. తనకు సంబంధించిన విషయంలో స్పష్టమైన స్టాండ్ ఉంటుంది. అఖిల్ విషయానికి వస్తే అఖిల్ అలా కాదు. నేను చెప్పిన ప్రతిదానికి వాదిస్తాడు. యంగ్ ఏజ్ కాబటి తర్జనభర్జన పడతాడు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటాడు.. తర్వాత గోడ మీద పిల్లిలా ఇంకో గోడకు దూకినట్లు మళ్లీ మార్చేస్తాడు. ఏ నిర్ణయం అయినా స్ట్రాంగ్‌గా నిలబెట్టుకోవడం ఇంకా నేర్చుకుంటున్న దశలోనే ఉన్నాడు” అని అమల చెప్పారు. జీవితంలో మంచి, చెడు రెండూ వస్తుంటాయి కానీ వాటిని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకుంటే చాలు అని ఆమె చెప్పిన విధానం చాలా రియల్‌గా అనిపించింది.
ఇక కోడళ్ళ విషయానికి వస్తే అమల హృదయపూర్వకంగా మాట్లాడింది. “నాకు ఇద్దరు మంచి కోడళ్లు దొరికారు. ఇద్దరూ టాలెంటెడ్, ఇండిపెండెంట్ మహిళలు. వారితో టైం గడపడం నాకు చాలా ఇష్టం” అని చెప్పింది. శోభిత గురించి “చాలా డేరింగ్, మెచ్యూర్‌గా ఉంటుంది” అని, జైనా (అఖిల్ భార్య) గురించి “చాలా క్యూట్, మంచి హృదయం ఉన్న అమ్మాయి. ఇంట్లో ఉంటే సందడి పెరుగుతుంది” అని చెప్పింది. అలాగే తన అత్త మామ అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ గురించి మాట్లాడుతుంటే అమల కొంచెం ఎమోషనల్ అయింది. “నా అత్తమ్మ దగ్గర నుంచి నేను ఎంత నేర్చుకున్నానో చెప్పలేను. ఆ విలువలు మా కోడలు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. నాకు పూజలు గురించి పెద్దగా తెలియదు కానీ వేదాల గురించి బాగా తెలుసు” అని చెప్పారు.