దక్షిణ మధ్య రైల్వే కాజీపేట-బళ్లార్ష విద్యుద్దీరణ ప్రాజెక్టులో భాగంగా.. ఆసిఫాబాద్- రేచిని రోడ్డు మధ్య 19 కిలోమీటర్ల దూరం వరకు విద్యుద్దీకరణతో పాటు మూడవ రైల్వే లైన్ పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకొనివచ్చింది. గ్రాండ్ ట్రంక్ మార్గంలోని కాజీపేట-బళ్లార్ష మధ్య ఉన్న ఈ సెక్షన్.. దేశంలోని ఉత్తర ప్రాంతాన్ని దక్షిణ ప్రాంతంతో అనుసంధానించే కీలకమైన రైలు మార్గం. ఈ కీలకమైన ప్రాజెక్టులో ఇప్పటివరకు మొత్తం 151 కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేశారు. గతంలో పూర్తిచేయబడిన రాఘవాపురం-మందమర్రి సెక్షన్ ను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం కాజీపేట-బళ్లార్ష సెక్షన్ లో మొత్తం 184 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణతో పాటు మూడో లైన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
Tamilisai: తెలంగాణ ప్రజలను వదిలి వెళ్తునందుకు బాధగా ఉంది.. ఎప్పటికీ మరువను
కాజీపేట- బళ్లార్ష మధ్యగల ఈ సెక్షన్.. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. ఈ కీలక విభాగంలో మెయిన్ లైన్ ప్యాసింజర్ మరియు సరకు రవాణా విభాగాల తరలింపును పెంపొందించుటలో తోడ్పడుతూ.. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లపై అధిక వత్తిడిని తగ్గిస్తుంది. మొదట్లో ఈ కీలక విభాగంలో రద్దీని తగ్గించడానికి 2016 సంవత్సరంలో రాఘవాపురం-మందమర్రి మధ్య 33 కిలోమీటర్ల మేర మూడవ లైన్ పనులు పూర్తిచేశారు. కాజీపేట- బళ్లార్ష సెక్షన్ లోని మిగిలిన 202 కి.మీమేర (ఇందులో తెలంగాణ పరిధిలోని 159 కి.మీ. & మహారాష్ట్ర సరిధిలోని 43కి మీ) భాగంలో ట్రాఫిక్ ను మరింత సులభతరం చేసేందుకు ట్రిప్లింగ్ 5 విద్యుద్దీకరణ పనుల కోసం 2015-16 సంవత్సరంలో రూ.2,063 కోట్ల కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేశారు. అందులో భాగంగా హసన్ పర్తి రోడ్డు-రాఘవాపురం మధ్య 72 కిలోమీటర్లు.. సిర్పూర్ కాగజ్ నగర్-మాణిక్ ఘర్ మధ్య 60 కిలోమీటర్ల మేర పనులు ఇప్పటికే పూర్తి చేశారు.
CM Revanth: ముంబై నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 159 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోకి వచ్చే 19 కిలోమీటర్ల మేర ఆసిఫాబాద్- శనిని రోడ్డు మధ్య మూడో లైన్ పనులు పూర్తి అవ్వడంతో ఈ ప్రాంతంలో సామాజిక ఆర్ధిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ విభాగంలో మూడవ లైన్ ను ప్రారంభించడం వల్ల.. ఈ గ్రాండ్ ట్రంక్ రూట్ సరుకు రవాణా మరియు ప్యాసింజర్ రైళ్లను సజావుగా నడిచేందుకు వీలుకలుగుతుంది. ఈ ప్రాజెక్టు మిగిలిన భాగాలలో పనులు వేగంగా జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ నిర్ణీత సమయంలో మూడవ లైన్ పనులను పూర్తి చేసినందుకుగాను సికింద్రాబాద్ డివిజన్ మరియు నిర్మాణ సంస్థ బృందాన్ని అభినందించారు.