Pushpa 2 will be released in Bengali: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప 2 ఆగస్ట్ 15న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఇటీవల రిలీజైన టీజర్.. సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. దాంతో పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2ను బంగ్లాలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన రికార్డ్ సాధించింది. పుష్ప 2 గురించి మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. బెంగాలీ భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: Lok Sabha Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న సూపర్ స్టార్!
పుష్ప 2 సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్ అందింది. అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు మరో టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్నట్లు సమచారం. ఇటీవల వచ్చిన టీజర్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో మరో టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ విన్న బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.