Director Teja: టాలీవుడ్ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ కు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన ఘనత ఆయనకు ఉంది. ఆయన స్కూల్ నుంచి వచ్చినవారు ఇప్పుడు స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఎవరికైనా యాక్టింగ్ రాలేదు అంటే చెంప మీద కొట్టి మరీ నటన నేర్పించగల డేర్ ఉన్న దర్శకుడు తేజ. ఇక తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పగలిగిన వ్యక్తి కూడా.. అలా చెప్పడం వలనే ఆయనకు పొగరు అంటూ ఇండస్ట్రీలో పేరు వచ్చింది. ఇక ప్రస్తుతం తేజ.. దగ్గుబాటి వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో ఉన్నాడు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటిస్తున్న అహింస చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన తేజ.. వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ.. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నాడు.
Mukesh Gowda: ‘గుప్పెడంత మనసు’ హీరో రిషి ఇంట తీవ్ర విషాదం
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తేజ.. తన కొడుకును త్వరలోనే హీరోగా పరిచయం చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. ” నా కొడుకుకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది. వాడి కోరికను నేను కాదనలేదు.. త్వరలోనే వాడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తా.. నా కొడుకు అందంగా ఉంటాడు.. కానీ, హీరో అవ్వడానికి అది ఒక్కటే సరిపోదు. అందుకే విదేశాల్లో కొన్ని కోర్సులు నేర్చుకుంటున్నాడు. త్వరలో ఇండియా వస్తాడు” అని చెప్పుకొచ్చాడు. అయితే తన కొడుకును తానే డైరెక్ట్ చేస్తాడా..? లేక వేరే డైరెక్టర్ చేతికి అప్పగిస్తాడా..? అనేది తెలియాలి. ఎంతోమంది స్టార్లను తయారుచేసిన తేజ.. తన కొడుకును స్టార్ గా చేస్తాడో లేదో చూడాలి.