Pushpa 2 : సింగిల్ స్క్రీన్ టికెట్లకు కొత్త రేటు?
- పుష్ప 2 సినిమా రేట్లు పెరిగే ఛాన్స్
- సింగిల్ స్క్రీన్ టిక్కెట్ల ధర రూ.300
- ప్రభుత్వంలో చర్చలు జరుపనున్న నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా పుష్ప ది రూల్. అల్లు అర్జున్ స్టామినా ఏంటో ఈ సినిమాతో అర్థమవుతుందనేలా బజ్ క్రియేట్ అయింది. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉండనుంది. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగింది. అయితే సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ఏపీలో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుష్ప 2 ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి తోడు మొదటి భాగం పుష్ప: ది రైజ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి నేపథ్యం ఉన్నందున, పుష్ప 2 టికెట్ ధరల విషయంలో కూడా భారీ మార్పులు తీసుకురానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో రేట్లు పెరగడం కొత్త విషయమేమీ కాదు. అయితే ఏపీలో రేటు ఎంత పెరుగుతుంది అనేది ఆసక్తికరమైన అంశం.
Read Also:Ponguleti Srinivas Reddy : మనిషి ఎక్స్ రే మాదిరిగా సర్వే జరుగుతుంది
Also Read
- Social Media: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
గతంలో పుష్ప 1 విషయంలో నిర్మాతలకు సరైన సపోర్ట్ అందలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు. అందుకే ఈసారి మంచి రేటు ఉండేలా చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర 150-200 రూపాయల మధ్య ఉంటే, పుష్ప 2 కోసం ఈ రేటును 300 రూపాయల వరకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం ఎదుట ఉంచనున్నట్లు తెలుస్తోంది. టికెట్ ధరలు పెంచడం కోసం మైత్రి నిర్మాతలు ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఎలాగూ ఎక్స్ ట్రా షోలు బెన్ ఫిట్ షోలకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ సలార్ వంటి పాన్ ఇండియా చిత్రాలకు ఈ తరహా ప్రత్యేకతలు వర్తింపజేశారు. కానీ రూ.300 రేంజ్ లో ఇవ్వలేదు. దేవరకు 250 వరకు ఇచ్చారు. ఇక ఈసారి పుష్ప 2 కోసం ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
పుష్ప 2 పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కారణంగా టికెట్ ధరల పెంపు నిర్ణయానికి సానుకూల స్పందన వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది. అందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు, అల్లు అర్జున్ నటన, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి. ప్రీమియమ్ రేట్లను కూడా ప్రేక్షకులు అంగీకరించే అవకాశాలున్నాయి. కానీ వీకెండ్ వరకు రూ.300 పెట్టి ఆ తరువాత తగ్గిస్తే లాంగ్ రన్ కలెక్షన్లు బాగుంటాయనే అభిప్రాయాలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Social Media: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్‌లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!