పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటనతో పాటు కేవలం హీరోయిన్‌గా దీపికా పదుకొణె ఎంపికైనట్లు మాత్రమే సమాచారం బయటకు వచ్చింది. అయితే, ఈ సినిమాలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని మొదట వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. అట్లీ ఈ సినిమాను ఒక ప్రత్యేక కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నాడని, ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలలో కనిపించబోతున్నాడని అంటున్నారు.
READ MORE: Andhra Premier League: క్రికెట్ లవర్స్ కు పండగే.. సాగరతీరం విశాఖలో మరో సందడి
ఇందులో వింత ఏముందని అనుకుంటున్నారా? అయితే, ఇక్కడే అసలు ఆసక్తికర విషయం ఉంది. ఈ సినిమాలో తాతగా, తండ్రిగా, ఇద్దరు కుమారులుగా అల్లు అర్జున్ నాలుగు పాత్రలు పోషిస్తున్నాడు. ఇప్పటివరకు అల్లు అర్జున్ కెరీర్‌లో ఒక్కసారి కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. ఏకంగా ఈ సినిమాతో ఆయన చతుర్పాత్రాభినయం చేయడం గమనార్హం. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారంతో అత్యంత గ్రాండ్‌గా నిర్మించడానికి రంగం సిద్ధమవుతోంది. అయితే, అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలలో కనిపించబోతున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ MORE: Crime News: డబ్బులు ఊరికే రావు అనుకుని.. గలీజ్ దందాకు తెర!
