మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి బెంగుళూరులో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇప్పుడు క్లింకార, అల్లు అర్హ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓ సినిమా కూడా చేసింది.. సోషల్ మీడియాలో అర్హ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి..
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఉపాసన క్లింకారను ఎత్తుకొని ఉంది.. ఇక అల్లు అర్హ తన తండ్రి నటించిన పుష్ప సినిమాలోని శ్రీవళ్లి పాటకు క్లింకారతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది… ఆ వీడియోను చూసిన నెటిజన్లు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా క్యూట్ గా చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు..
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ పుష్ప 2 – ది రూల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15, 2024న థియేటర్లలోకి రానుంది. ఫ్రాంచైజీలోని మొదటి చిత్రం పుష్ప: ది రైజ్, యాక్షన్ ఎంటర్‌టైనర్, ఇది డిసెంబర్ 17, 2021న థియేటర్‌లలో విడుదలైంది. దీనికి సుకుమార్ దర్శకత్వం వహించారు.
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో నటించారు..
రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ చిత్రం ప్రస్తుత రాజకీయాలతో కూడిన యాక్షన్ డ్రామాగా పేర్కొనబడింది మరియు తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. గేమ్ ఛేంజర్‌ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు మరియు శిరీష్ గారు సంయుక్తంగా నిర్మించి పాన్-ఇండియా విడుదల చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది..
Klin Kaara & Arha ❤️#RamCharan @AlwaysRamCharan pic.twitter.com/Rmkxo7RTIW
— HI 𝗛𝗮𝗿𝗶𝗸𝗮 🦋❤️ (@always_harika_) January 15, 2024