NTV Telugu Site icon

Budget 2024: స్నేహపూర్వక దేశాలకు భారీ సాయం..రూ.5,667.56 కోట్ల కేటాయింపు

Jaishankarmodi

Jaishankarmodi

ప్రధాని మోడీ 3.0 తొలి సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా.. 2024-25 సాధారణ బడ్జెట్‌లో భారతదేశం స్నేహపూర్వక దేశాలకు భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.22,155 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధిక మొత్తాన్ని భూమిపై స్వర్గంగా భావించే పొరుగు
దేశం భూటాన్‌కు అందించాలని నిర్ణయించారు.

READ MORE: Team India: శ్రీలంక చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో

గతేడాది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ₹18,050 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పుడు దాన్ని రూ.29,121 కోట్లకు పెంచారు. భారత ప్రభుత్వం 2023-24 బడ్జెట్‌లో స్నేహపూర్వక దేశాలకు రూ. 5,848.58 కోట్లు కేటాయించింది. తరువాత అది ₹ 6,541.79 కోట్లకు సవరించబడింది. ఈ ఏడాది 2024-25 బడ్జెట్‌లో స్నేహపూర్వక దేశాలకు రూ.5,667.56 కోట్లు ఇవ్వనున్నారు.

READ MORE: Minister Kolusu Parthasarathy: ఏపీని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం కేటాయింపులు..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ ప్రకారం, భూటాన్‌కు 2024-2025లో ₹ 2,068.56 కోట్ల సహాయం అందించబడుతుంది. మాల్దీవులతో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ.. 2024-25 బడ్జెట్‌లో భారతదేశం ₹400 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే, 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌లో, ₹770.90 కోట్ల మొత్తాన్ని మాల్దీవులకు అందించారు. భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లకు కలిపి రూ.320 కోట్లు ఇవ్వనుంది.

READ MORE: Minister Kolusu Parthasarathy: ఏపీని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం కేటాయింపులు..

దేశాల వారీగా కేటాయించిన సాయం రూ. కోట్లలో..

1. భూటాన్: ₹2,068.56 కోట్లు

2. నేపాల్: ₹700 కోట్లు

2. మాల్దీవులు: ₹400 కోట్లు

3. మారిషస్: ₹370 కోట్లు

4. మయన్మార్: ₹250 కోట్లు

5. శ్రీలంక: ₹245 కోట్లు

6. ఆఫ్ఘనిస్తాన్: ₹200 కోట్లు

7. ఆఫ్రికన్ దేశం: ₹200 కోట్లు

8. బంగ్లాదేశ్: ₹120 కోట్లు

9. సీషెల్స్ (తూర్పు ఆఫ్రికా దేశం): ₹40 కోట్లు