పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కాల్పుల విరమణ ఉల్లంఘనను వార్తలను ఖండించింది. పూర్తి నిజాయితీతో కాల్పుల విరమణను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే.. భారతదేశం వైపు నుంచి ఉల్లంఘన సంఘటనలు జరిగాయని ఆరోపించింది. వాటిని పాకిస్థాన్ సైన్యం బాధ్యతాయుతంగా, సంయమనంతో నిర్వహించిందని పేర్కొంది. కాల్పుల విరమణ సజావుగా అమలు చేయడంలో ఏమైనా సమస్యలు తలెత్తే.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తాము…
Bandi Sanjay : పాకిస్తానీ చేతిలో దుబాయిలో దారుణంగా హత్యకు గురైన ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రేమ్ సాగర్ తోపాటు హత్యకు గురైన నిజామాబాద్ కు చెందిన శ్రీనివాస్ మృత దేహాలను వీలైనంత తొందరగా స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు మృతుల కుటుంబాలకు అండగా…
Rahul Gandhi: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. జో బైడెన్, ప్రధాని నరేంద్రమోడీని రాహుల్ గాంధీ ఎగతాళి చేయడాన్ని దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అమెరికాతో భారత్‌కి ఉన్న బంధాలకు అనుగుణంగా ఆయన వ్యాఖ్యలు లేవని చెప్పింది. శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోడీ 3.0 తొలి సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా.. 2024-25 సాధారణ బడ్జెట్‌లో భారతదేశం స్నేహపూర్వక దేశాలకు భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి.
ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై వివరణ ఇచ్చింది కేంద్ర విదేశాంగ శాఖ. విద్యార్థులు బందీలుగా ఉండటంపై మాకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఉక్రెయిన్‌లోని ఇండియా ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉంది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారు. భారత పౌరుల తరలింపునకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నాం. భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు తెలిపింది విదేశాంగ…