NTV Telugu Site icon

Alleti Maheshwar Reddy: ఆరు మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదు..

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ఆరు మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల కోడ్ పేరుతో ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తప్పించుకుని తిరిగారని పేర్కొన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేయకుండా.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ కేవలం ఎనిమిది ఎంపీ సీట్లే గెలిచిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. 14 సీట్లు గెలుస్తాం.. తమ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమని ముఖ్యమంత్రి చెప్పారని.. 14 సీట్లు గెలుస్తామని కేవలం 8 సీట్లే గెలిచినందుకు రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని అన్నారు. ఎన్నికల ముందు డిక్లరేషన్లు ప్రకటించి విస్మరించారని తెలిపారు.

Sree Leela: శ్రీ లీల ఏంటి ఇలా అయిపొయింది?

ప్రజలను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. తన కుర్చీ కాపాడుకోవడం కోసమే సమయం సరిపోతుందని ఆరోపించారు. ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎప్పుడూ ఇస్తారో స్పష్టం చేయాలన్నారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామన్నారు.. స్కూటీలు ఎప్పుడూ ఇస్తారని విద్యార్థినులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది..? రుణమాఫీ కోసం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టుకున్నారు.. 420 హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఎప్పుడూ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

Mahalaxmi Express: రైలులో బిడ్డకు జన్మనిచ్చని ముస్లిం మహిళ.. బిడ్డకు హిందూ దేవత పేరు..

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి చేతులు దులుపుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ధరణి అవకతవకలను రాష్ట్ర ప్రజల ముందు ప్రభుత్వం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఎన్ని డ్రామాలు చేసిన కేవలం 8 సీట్లలో మాత్రమే ప్రజలు గెలిపించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తారో చెప్పాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 18న గవర్నర్ అపాయింట్ మెంట్ కోరానని.. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సీబిఐతో విచారణ జరిపించాలని కోరుతానని తెలిపారు.