మాయల గారడితో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఏమీ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తున్నారు.. మూడో వంతు మందికి కూడా రుణమాఫీ చేయకుండా సంబరాలు చేసేందుకు సిగ్గుండాలి? అని దుయ్యబట్టారు. రుణమాఫీకి ఇచ్చింది రూ.6098 కోట్లు మాత్రమే ఇచ్చారు.. ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేశారు? అని మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు.