Special Shows: స్టార్స్ ఇమేజ్ పై స్పెషల్ షోస్ దెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Shows: ఒకప్పుడు స్టార్ హీరోలు సంవత్సరంలో పలు చిత్రాలతో సందడి చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఒక్కో ఏడాది 12,13 సినిమాలు చేసిన సందర్భం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సంవత్సరాలు 6,7 చిత్రాలలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మన స్టార్ హీరోలు ఏడాదికి ఒక చిత్రంతో రావటమే గగనం అయిపోతోంది. దీంతో ఆ యా హీరోల అభిమానులు తమ ఫేవరేట్ హీరో సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో అభిమానులు తమ హీరోల పుట్టిన రోజును గ్రాండ్ గా జరపటంతో పాటు ఆ యా హీరోల కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను ల్యాండ్ మార్క్ డేట్స్ లో రీ రిలీజ్ చేసే సంప్రదాయం కూడా మొదలయింది. ఇది కొంత మేరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగినా ఆపై పెద్ద తలనొప్పిగా మారి ఆ యా స్టార్ హీరోల ఇమేజ్ ను దెబ్బతీసే వరకూ వెళుతోంది. మహేశ్ ఫ్యాన్స్ మొదలు పెట్టిన ఈ రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడు అందరు హీరోల చిత్రాలకూ పాకింది.
Read also: Hit-2 Urike Urike Full Song: ‘హిట్ 2’ నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్ ‘ఉరికే ఉరికే’
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
ఈ రీ-రిలీజ్ లో ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘జల్సా’, ‘చెన్నకేశవరెడ్డి’ వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు తరుణ్ ‘నువ్వే నువ్వే’ ఆడియన్స్ ను అలరించాయి. ఈ వారం ప్రభాస్ నటించిన ‘వర్షం’ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ ట్రెండ్ కమర్షియల్ యాంగిల్ కి దారితీయటంతో ప్లాఫ్ సినిమాలు, యావరేజ్ సినిమాలు కూడా రీ-రిలీజ్ కి క్యూ కట్టాయి. ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘రెబల్’ రిలీజ్ కావటమే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఎన్టీఆర్ యావరేజ్ సినిమా ‘బాద్‌షా’ స్పెషల్ గా రీ-రిలీజ్ కాబోతోంది. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. ఈ రీరిలీజ్ సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం అమలులో ఉన్న కొత్త సినిమాల రేట్లతోనే ప్రదర్శితం కానుండటం గమనార్హం. ఇంకో విషయం ఏమిటంటే ఇలా రీరిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువ భాగం యు ట్యూబ్ తో పాటు ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోనే ఉన్నాయి. సో ఇది కమర్షియల్ యాంగిల్ తో రిలీజ్ చేసే వారి సినిమాలపై పెద్ద దెబ్బ తీస్తుంది. అంతే కాదు ఆ యా హీరోల ఇమేజ్ ను కూడా తగ్గిస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో హిట్ సినిమాలపై అభిమానులు, ప్రేక్షకుల అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలనే కోణంలో ఈ ట్రెండ్ కొనసాగితే మాత్రం నిరాశ ఎదురు కాక తప్పదు. అప్పుడు గత హిట్ సినిమాల రీరిలీజ్ ట్రెండ్ సమాధి అయినట్లే. చూద్దాం ఏం జరుగుతుందో!
Maoists Mulugu District: వ్యక్తిని దారణంగా చంపిన మావోయిస్టులు.. ఇన్‌ఫార్మర్ అంటూ లేఖ
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!