Ind vs Pak : 2023 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 14 శనివారం భారత్ – పాకిస్థాన్మ్యాచ్జరగనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం సమరానికి రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచంలోకి క్రికెట్ ప్రియుల కళ్లన్నీ ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో పాక్‌పై భారత్‌కు ఘనమైన ట్రాక్రికార్డు ఉంది. ప్రపంచకప్ హిస్టరీలో పాకిస్థాన్‌తో 7 సార్లు తలపడగా.. ఏడింట్లోనూ భారత జట్టు విజయం సాధించింది. అయితే జట్టులోని సభ్యులందరూ సమష్టి కృషితో రాణించినప్పుడే.. ఇలాంటి విజయాల్ని నమోదు చేయగలం. ఇక శనివారం కూడా మ్యాచ్ లో గెలిచి పాక్ పై జైత్రయాత్రను కొనసాగించాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
Read Also:Group-2: అశోక్ నగర్ లో ఉద్రిక్తత… గ్రూప్ 2 విద్యార్థిని బలవన్మరణం..
మరోవైపు ఈసారైనా భారత్‌పై నెగ్గాలని పాకిస్థాన్ తహతహలాడుతోంది. ఈ క్రమంలో ఆయా వరల్డ్కప్ఎడిషన్లలో పాక్‌పై మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్అవార్డు గెలుచుకున్న టీమ్ ఇండియా ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం. భారత్-పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ 1992 మ్యాచ్‌లో 54*(62) పరుగులు చేసినందుకు సచిన్ టెండూల్కర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 1996లో నవజ్యోత్ సిద్ధూ 93(115) స్కోర్‌తో దానిని కైవసం చేసుకోగా, 1999లో వెంకటేష్ ప్రసాద్ ఐదు వికెట్లు తీసి విజేతగా నిలిచాడు. 2003, 2011లో కూడా సచిన్‌కు ఈ అవార్డు దక్కింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 2015, 2019 ఎడిషన్లలో దీనిని గెలుచుకున్నారు.
Read Also:Kiren Rijiju: ఐదు రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు.. కిరణ్ రిజిజుకి కీలక బాధ్యతలు..