Custody: ఈ ఏడాది అక్కినేని హీరోలకు అసలు కలిసిరాలేదనే చెప్పాలి. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్యకు అస్సలు కలిసి రాలేదు. ఎంతో గొప్పగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా సినిమాత్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా చైతూ కు ఒరిగిందేమి లేదు. ఇక ఈ యేడాదిని వదిలేసి వచ్చే ఏడాదిపై ఫోకస్ చేశాడు అక్కినేని హీరో. నిజం చెప్పాలంటే అసలు సిసలైన టాస్క్ లు అన్ని చై కు వచ్చే ఏడాది ఉండనున్నాయి. మొట్ట మొదటిసారి చైతూ హర్రర్ నేపథ్యంలో దూత అనే సిరీస్ చేస్తున్నాడు అది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఇది కాకుండా మొదటిసారి అక్కినేని హీరో బై లింగువల్ గా కోలీవుడ్ దర్శకుడు డైరెక్షన్ లో నటిస్తున్నాడు. అది కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న చిత్రం కస్టడీ. ఈ చిత్రంలో చై.. పవర్ ఫుల్ పోలీసాఫీర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన చై లుక్ భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో చై సరసన కృతి శెట్టి నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మే 12 న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. మండు ఎండల్లో అక్కినేని హీరో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.