వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. దీనికి భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టీం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా గ్రౌండ్ లోకి అడుగుపెట్టనుంది. టీమిండియాలో అత్యుత్తమ టీ20 ఆటగాళ్ళు కొందరు ఉన్నందున అందరి దృష్టి ఈ జట్టుపైనే ఉంటుంది. వారిలో అభిషేక్ శర్మ ఒకరు. అభిషేక్ తన విధ్వం బ్యాటింగ్‌తో బౌలర్లకు పీడకలగా మారాడు. అయితే, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రకారం, టీమిండియా బలమైన ప్లేయర్ అభిషేక్ శర్మ కాదు. టీం ఇండియాలో చేరినప్పటి నుండి, అభిషేక్ T20 జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా మారాడు. అతని విధ్వంసకరమైన బ్యాటింగ్ భారతదేశాన్ని అనేక అద్భుతమైన విజయాలకు నడిపించింది. అయితే, అక్తర్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ ను భారత్ కి గేమ్ ఛేంజర్ అని జోష్యం చెప్పాడు
Also Read:Bihar: జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగికి షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ
సూర్యకుమార్ చాలా ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ అని, సూర్య బ్యాట్ ఝుళిపిస్తే టీం ఇండియాకు లక్కే అని అక్తర్ అన్నారు. సూర్యకుమార్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో లేడు. అతని ఫామ్‌పై కూడా ప్రశ్నలు తలెత్తాయి. పిటివి స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, అక్తర్ మాట్లాడుతూ, “భారతదేశంలో ప్రతిభకు కొరత లేదు. అందుకే ఈ జట్టు టైటిల్‌కు అతిపెద్ద పోటీదారు అని నేను భావిస్తున్నాను, కానీ టీం ఇండియా గెలవాలంటే కెప్టెన్ సూర్యకుమార్ పరుగులు సాధించాల్సి ఉంటుంది. అతను భారత్ కి కీలక ఆటగాడు, అతను గేమ్ ఛేంజర్ అని నిరూపించుకునే సత్తా ఉన్న ప్లేయర్ అని తెలిపాడు. టీం ఇండియా టైటిల్ రేసులో ఉండాలంటే కెప్టెన్ పరుగులు సాధించాల్సి ఉంటుంది. టి20లో త్వరగా పరుగులు సాధించే విషయానికి వస్తే, సూర్యకుమార్ యాదవ్ బాగా బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యం” అని అన్నారు.
సూర్యకుమార్ T20 జట్టుకు కెప్టెన్ అయినప్పటి నుంచి ఆటలో స్థిరత్వం లేదు. గత కొన్ని సిరీస్‌లలో పేలవమైన బ్యాటింగ్ తో చేతులెత్తేస్తున్నాడు. సూర్య కెప్టెన్సీలో జట్టు బాగా రాణిస్తున్నప్పటికీ, సూర్యకుమార్ బ్యాటింగ్ ఆకట్టుకోలేకపోతోంది. ఫిబ్రవరి 7, మార్చి 8 మధ్య జరిగే T20 ప్రపంచ కప్‌లో భారత జట్టు కెప్టెన్ బాగా రాణించడం కీలకంగా మారింది.