అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చి కూడా అనుకున్నంత ఫేమ్ సంపాదించలేకపోయాడు అఖిల్. స్టార్ కిడ్ అయినా కూడా ముందు నుండి తన గ్రాఫ్ అంతకంత పడిపోతూనే ఉంది. ముఖ్యంగా ఆఖరి సినిమా ‘ఏజెంట్’ పెద్ద డిజాస్టర్ అవ్వడంతో తన కెరీర్ కి చాలా పెద్ద దెబ్బ పడింది. దీంతో దాదాపు రెండేళ్లు బ్రేక్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో ‘లెనిన్’ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట శ్రీలీలను అనుకున్నా, చివరికి భాగ్యశ్రీ బోర్సే ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో అఖిల్ డీ గ్లామర్ లుక్ లో కనింపిస్తుండటంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ గట్టిగా ట్రై చేస్తున్నట్లుగా క్లియర్ గా తెలుస్తుంది.
Also Read : Mehreen : హాట్ టాపిక్‌గా మారిన మెహరీన్ పెళ్లి.. ఒక్క పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన యంగ్ బ్యూటీ!
దీంతో అక్కినేని అభిమానులకు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అయితే, ఇప్పుడు ‘లెనిన్’ గురించి ఒక హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక మాస్ డ్యాన్స్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను రంగంలోకి దించుతున్నారట. భారీ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్‌లో అనన్య, అఖిల్‌తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అంతేకాదు, అనన్య ఈ సినిమాలో పాటతో పాటు ఒక చిన్న రోల్ కూడా చేస్తుందని అంటున్నారు. అనన్య గ్లామర్, డ్యాన్స్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, అఖిల్-అనన్య జోడీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
