నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుని.. కలెక్షన్‌ల పరంగా ధుమ్ములేపుతోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం, 2025 లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రావాలనే ఒప్పందం ఉండటంతో, అఖండ తన తాండవానికి డిజిటల్ స్ర్కీన్‌లపై ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నడు.
కాగా సమాచారం ప్రకారం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9, 2025 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇక ఆది పినిశెట్టి విలన్‌గా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాలో బాలయ్య తన విశ్వరూపాన్ని చూపించారు. బాక్సాఫీస్ వద్ద ఇతర భారీ చిత్రాల పోటీ ఉన్నప్పటికీ, అఖండ క్యారెక్టర్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓటీటీలో ఈ సినిమా రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుండి అధికారిక ప్రకటన రానుంది.