గద్వాల నవ వరుడు ప్రేవేట్ సర్వేయర్ అయిన తేజేశ్వర్ ను పెళ్లైన కొన్ని రోజులకే ప్రియుడితో కలిసి అంతమొందించింది భార్య ఐశ్వర్య. పెళ్లికి ముందే బ్యాంక్ మేనేజర్ అయిన తిరుమల రావుతో ప్రేమాయణం నడిపించిన ఐశ్వర్య పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేసింది. ప్రియుడు తిరుమల రావు వాయిస్ ఛేంజర్ డివైస్ సాయంతో మహిళ గొంతుతో ఐశ్వర్యతో మాట్లాడే వాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్తను చంపి ఎవరికి అనుమానం రాకుండా కంట్లో గ్లిజరిన్ వేసుకుని దొంగ ఏడుపులు ఏడ్చిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Also Read:Disha Patani : అందాల ఆరబోతలో దయ లేని దిశా పటాని
జూన్ 17న తేజేశ్వర్ కనిపించకపోవడంతో తోబుట్టువులందరూ కలత చెంది, కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే ఆమె ముఖంలో ఏమాత్రం బాధ కనిపించలేదన్నారు. ఇటీవల ఐశ్వర్య గదిలో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు గ్లిజరిన్ బాటిల్ ను గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా కన్నీళ్లు వచ్చేలా కంట్లో వేసుకుని నటించిందని అనుమానిస్తున్నారు. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీనిపై గద్వాల సీఐ శ్రీను మాట్లాడుతూ గ్లిజరిన్ సీసాను స్వాధీనం చేసుకుని కుటుంబీకుల ఆరోపణల కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇది తెలిసిన వారు ఐశ్వర్య మహానటిని మించిపోయిందని కామెంట్ చేస్తున్నారు.
Also Read:Bombay High Court: వివాహ సమస్యలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి.. చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు..
ప్రధాన నిందితులకు కోర్టు తాజా రిమాండ్ అనంతరం ఏ1 తిరుమలరావు, ఏ3 నాగేష్, ఏ4 పరుశరాము, ఏ5 రాజులను నాలుగు రోజులు కస్టడీలోకి తీసుకొని నిర్వహించిన విచారణలో వెల్లడైన అంశాలను ఆదివారం గద్వాల సీఐ శ్రీను విలేకరులకు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యల మధ్య ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని తెలిపారు. ఐశ్వర్యను రెండో వివాహం చేసుకుంటానని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. మరోవైపు తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువుపోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య, తేజేశ్వర్‌ని వివాహం చేసుకుంది. తేజేశ్వర్ కు విషయం తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదం అని అతడిని చంపాలని ప్రియుడు తిరుమల రావును ప్రేరేపించింది. అంతిమంగా తేజేశ్వర్ ప్రాణాలు తీసింది.