Airtel: ప్రముఖ టెలికం సేవలందిస్తున్న ఎయిర్‌టెల్ భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 189 దేశాల్లో అన్‌లిమిటెడ్ డేటా సేవలను పొందవచ్చు. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏ దేశానికి వెళ్లినా ప్రత్యేకంగా జోన్‌లు లేదా ప్యాక్‌లు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ప్లాన్‌తోనే 189 దేశాల్లో కనెక్ట్ అవ్వచ్చు. ఇది ప్రస్తుత రోజుల్లో ఏ నెట్వర్క్ ఇలాంటి ప్లాన్ ను అందించడంలేదు.
విదేశాల్లో ఉన్న భారతీయుల (NRI) కోసం ఎయిర్‌టెల్ ప్రత్యేకంగా రూ. 4000 విలువ గల ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ఏడాది కాలం పాటు చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది. ఇందులో 5GB డేటా, 100 ఇంటర్నేషనల్ వాయిస్ నిమిషాలు లభిస్తాయి. ఇదే ప్లాన్‌ను భారత్‌లో వాడితే రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయం లభిస్తుంది.
ఇక ఈ ప్లాన్ ప్రధాన విశేషాలను చూస్తే.. ముఖ్యంగా విమాన ప్రయాణాల సమయంలో కూడా కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. విదేశీ గడ్డపై దిగిన వెంటనే సేవలు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. అలాగే ఏ సమయంలోనైనా సహాయం కోసం అందుబాటులో ఉంటుంది కస్టమర్ సపోర్ట్. దీని వలన విడిగా ప్లాన్‌లు ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా విదేశాల్లో లోకల్ సిమ్‌లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. వినియోగాన్ని ట్రాక్ చేయడం, బిల్లింగ్ చెక్ చేయడం, అదనపు డేటా/నిమిషాలు జోడించడం కోసం ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో చూసుకోవచ్చు.
ఈ ప్లాన్ వినియోగదారులు తమ భారతీయ నంబర్‌ను ఉంచుకుని విదేశాల్లో నిరంతరంగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే, అన్‌లిమిటెడ్ డేటా పై ఫెయిర్ యూజేజ్ పాలసీ (FUP) వర్తిస్తుంది. ఇది ఒక స్థాయికి మించి వాడిన డేటాపై వేయబడే పరిమితి లాంటిది. మీరు విదేశాలకు తరచుగా ప్రయాణిస్తే లేదా కుటుంబ సభ్యులు బయట ఉన్నా, ఎయిర్‌టెల్ కొత్త ఇంటర్నేషనల్ ప్లాన్‌ను ఒకసారి పరిశీలించవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.