Delhi: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికి తెలుసు. కరోనా అన్నీ సంస్థలను దెబ్బతీయగా.. దాని ప్రభావం విమానాశ్రయ ఛార్జీలపై కూడా పడింది. విమానాశ్రయ ఛార్జీలు స్థిరంగా ఉన్నప్పటికీ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ లో విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో విమాన ఛార్జీల ట్రెండ్స్‌పై జరిపిన అధ్యయనంలో అత్యధిక విమాన ఛార్జీలు భారతదేశంలో (41 శాతం), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (34 శాతం), సింగపూర్ (30 శాతం), ఆస్ట్రేలియా (23 శాతం) పెరిగినట్లు నివేదిక తెలిపింది.
Read Also: Ariyana Glory : ఉప్పొంగే ఎద అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ..
2023లో భారతదేశం, ఇండోనేషియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా మరియు జపాన్‌లతో సహా పలు మార్కెట్‌లలో దేశీయ విమాన ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్గాల్లో మాత్రమే స్వల్పంగా తగ్గినట్లు పేర్కొంది. అయితే మహమ్మారి సమయంలో సంభవించిన నష్టాలను తిరిగి పొందేందుకు ఛార్జీలు పెంచుతున్నట్లుగా ACI ఆసియా-పసిఫిక్ విమానయాన సంస్థలు తెలిపాయి. మరోవైపు విమానాశ్రయాలు ల్యాండింగ్, పార్కింగ్ మరియు ప్రయాణీకుల రుసుములతో సహా విమానాశ్రయ ఛార్జీలను తగ్గించాయి.
Read Also: Adipurush Free tickets: ప్రకటనలేనా, చేతల్లో సాధ్యమయ్యే పనేనా?
విమాన ఛార్జీల పెరుగుదలలో ప్రధాన కారణమేంటంటే.. గణనీయంగా ఇంధన ధరలు మరియు ద్రవ్యోల్బణం పెరగడం. 2019తో పోలిస్తే 2022లో ఇంధన ధరలు 76 శాతం పెరిగాయి. అదే కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 10 శాతం పెరగడంతో ఎయిర్‌లైన్స్ ఖర్చులు పెరిగాయి. మరోవైపు విమాన ఛార్జీల పెరుగుదలపై కాంగ్రెస్ నాయకుడు కెసి వేణుగోపాల్ మరియు యూనియన్ సివిల్ ఏవియేషన్ జ్యోతిరాదిత్య సింధియా మధ్య ట్విట్టర్ యుద్ధం జరిగింది. ఈ విపరీతమైన విమాన ఛార్జీలు మధ్యతరగతి ప్రజలను విధ్వంసం సృష్టిస్తున్నాయని వేణుగోపాల్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోదా అని ప్రశ్నించారు. వేణుగోపాల్ వ్యాఖ్యలకు స్పందించిన సింధియా.. గతంలో ఒత్తిడిలో ఉన్న GoFirst ద్వారా సేవలందిస్తున్న మార్గాల్లో కొంత భాగాన్ని ఇప్పటికే ఇతర విమానయాన సంస్థలకు కేటాయించామని తెలిపారు.