విమానాలు ఆలస్యమై ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే సంఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గురువారం (మే 30) దేశ రాజధాని ఢిల్లీ నుండి బయలుదేరాల్సిన ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో విమానం కొన్ని కారణాల వల్ల 24 గంటలు ఆలస్యమైంది. ఈ క్రమంలో డీజీసీఏ ఈ చర్య తీసుకుంది.
డీజీసీఏ జారీ చేసిన నోటీసులో.. చట్టబద్ధమైన సంస్థ AI 183 ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, AI 179 ముంబై-శాన్ ఫ్రాన్సిస్కో విమాన ఆలస్యం గురించి ప్రస్తావించింది. “(విమానాలు) చాలా సమయం ఆలస్యం అయ్యాయి. క్యాబిన్‌లో తగినంత చల్లగా లేకపోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అంతేకాకుండా.. ఎయిర్ ఇండియా డీజీసీఏ నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణికులను పదేపదే అసౌకర్యానికి గురిచేస్తున్న సంఘటనలు గమనించబడ్డాయి. ” అని నోటీసులో పేర్కొంది. ఎయిరిండియాపై “ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్య ఎందుకు ప్రారంభించబడదు” అనే విషయాన్ని వివరిస్తూ.. మూడు రోజుల్లోగా షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని డీజీసీఏ విమానయాన సంస్థను ఆదేశించింది. నిర్ణీత వ్యవధిలోగా ఎయిర్‌లైన్ స్పందించకపోతే, “వ్యవహారాన్ని ఎక్స్‌పార్ట్‌గా ప్రాసెస్ చేయబడుతుంది” అని హెచ్చరించింది.
Madhya Pradesh High Court: ముస్లిం యువకుడితో, హిందూ యువతి వివాహం చెల్లదు..
ఇదిలా ఉంటే.. ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో విమానం ఆలస్యం కావడంతో చాలా మంది ప్రయాణికులు తమ పరిస్థితి గురించి Xలో తెలిరు. సోషల్ మీడియాలో ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించి విజువల్స్ పోస్ట్ చేశారు. ప్రయాణీకులు మొదట్లో విమానం లోపల వేచి ఉన్నారు.. అయితే ఎయిర్ కండిషనింగ్ సరిగా లేని కారణంగా కొంతమంది స్పృహతప్పి పడిపోయారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో.. ఎయిర్ ఇండియా వర్గాలు మీడియాతో మాట్లాడుతూ, సిబ్బంది మార్పు కోసం వేచి ఉండాల్సి వచ్చిందని.. ప్రయాణీకులందరికీ హోటల్లో బస ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ముంబై-శాన్‌ఫ్రాన్సిస్కో విమానంలో గత వారం ఇదే విధమైన సంఘటన జరిగింది. మే 24న విమానం మరుసటి రోజుకు రీషెడ్యూల్ చేశారు. దీంతో ప్రయాణికులు విమానంలో ఐదు గంటలకు పైగా వేచి చూశారు. సాంకేతిక లోపం కారణంగా ఆ విమానం ఆలస్యమైంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. కాగా.. ఈ విమానం ఆలస్యం విషయంలో కూడా ఎయిరిండియా హోటల్ వసతి, కాంప్లిమెంటరీ రీషెడ్యూలింగ్, ప్రయాణీకులకు పూర్తి వాపసులను అందించింది.