NTV Telugu Site icon

AICC: ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. సినీ నటికి అవకాశం!

Aicc

Aicc

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈనెల 10న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినకు వెళ్లారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గెతో భేటీ అయ్యారు. పార్టీలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్..ఏఐసీసీతో సమావేశామయ్యారు. తాజాగా ఏఐసీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి
దయాకర్, శంకర్ నాయక్, సినీ నటి విజయశాంతి పేర్లు ఫైనల్ చేసింది.

READ MORE: Best Recharge Plans: 90 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్స్.. జియో హాట్‌స్టార్ ఉచితం

కాగా.. రాష్ట్రంలో ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు సోమవారం(మార్చి 10)తో ముగియనుంది. ఇప్పటివరకు అధికార పార్టీల అభ్యర్థుల పేర్లు చివరి క్షణంలో విడుదల చేసింది. తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో నాలుగు సీట్లను అధికార కాంగ్రెస్, ఒక స్థానం ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ దక్కించుకునే అవకాశం ఉంది.