అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఒక్క వ్యక్తి తప్ప ఎవరూ బయటపడలేదు. విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతం. తాజాగా ఆయనకు సంబంధించి ఓ సమాచారం వెలువడింది. విమాన ప్రమాదం జరిగిన వెంటనే, విశ్వాస్ తన తండ్రితో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ వీడియో కాల్ గురించి అతని మరో సోదరుడు తెలిపారు. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే విశ్వాస్ తన తండ్రికి ఫోన్ చేసి తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారన్నారు.
READ MORE: Allu Arjun: రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడినీ.. సీఎం రేవంత్ ముందు అల్లు అర్జున్ తగ్గేదేలే!
నయన్ కుమార్ రమేష్ స్కై న్యూస్‌తో మాట్లాడుతూ.. “ప్రమాదం జరిగిన సమయంలో అతను నా తండ్రికి వీడియో కాల్ చేసి విమానం కూలిపోయిందని చెప్పారు. తాను ఎక్కడున్నానో తెలియదు అని తెలిపారు. చుట్టు పక్కల వేరే ప్రయాణీకులు ఎవరూ కనిపించడం లేదు. నేను ఎలా బతికి ఉన్నానో, విమానం నుంచి ఎలా బయటపడ్డానో నాకు తెలియదు” అని తన తండ్రికి చెప్పినట్లు తెలిపారు.
READ MORE: Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు.. టెల్ అవీవ్‌ను లక్ష్యంగా ఐడిఎఫ్ రాకెట్ లాంచర్..
కాగా.. అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం కూలిపోయిన విషయం తెలిసింది. ఎయిర్ ఇండియా అధికారులు ముందుగా షేర్ చేసిన ఫ్లైట్ మ్యానిఫెస్ట్‌లో 11A సీటులో ఉన్న ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ అని, ఆయన బ్రిటిష్ పౌరుడని ఉంది. విశ్వాస్‌తో ఆసుపత్రిలో మాట్లాడినట్లు ఏఎన్ఐ తెలిపింది. తన బోర్డింగ్ పాస్‌ను తమకు షేర్ చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. అందులో ఆయన పేరు, సీటు నంబర్ 11A ఉన్నట్లు తెలిపింది. ”టేకాఫ్ అయిన 30 సెకన్లకు పెద్దగా శబ్ధం వినిపించింది. ఆ తర్వాత విమానం క్రాష్ అయింది. ఇదంతా చాలా వేగంగా జరిగింది” అని విశ్వాస్ చెప్పినట్లుగా ఏఎన్ఐ తెలిపింది.