Air India Crash: గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా మొత్తం మంది చనిపోయారు. విమానంలో ఉన్న వారితో పాటు కింద ఉన్న వారితో సహా 270 మంది మరణించారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనన్ విమానం ప్రమాదానికి గురైంది.
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఒక్క వ్యక్తి తప్ప ఎవరూ బయటపడలేదు. విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతం. తాజాగా ఆయనకు సంబంధించి ఓ సమాచారం వెలువడింది. విమాన ప్రమాదం జరిగిన వెంటనే, విశ్వాస్ తన తండ్రితో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ వీడియో కాల్ గురించి అతని మరో సోదరుడు తెలిపారు. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే విశ్వాస్ తన తండ్రికి ఫోన్ చేసి తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలెట్ సుమిత్ లాస్ట్ మెసేజ్ ఇచ్చారు. ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటికొచ్చింది.