Rath Yatra Accident: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జగన్నాథుని రథయాత్రలో భారీ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని దరియాపూర్ కడియనక ప్రాంతంలోని ఓ భవనంలోని రెండో అంతస్తు బాల్కనీలో ప్రజలు నిలబడి రథయాత్ర చూస్తున్న సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో బాల్కనీలో నిల్చున్న వారితో పాటు కింద నిల్చున్న వారికి కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 11 మంది గాయపడినట్లు సమాచారం. వారందరినీ సివిల్ ఆసుపత్రిలో చేర్చారు.. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు.
బాల్కనీ పడిపోయిన భవనం శిథిలావస్థలో ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రథయాత్రను చూసేందుకు సామర్థ్యం కంటే ఎక్కువ మంది ఇంటి బాల్కనీకి చేరుకున్నారు. జనం ఒకరితో ఒకరు తోసుకుంటూ బాల్కనీ గోడపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా అది కుప్పకూలిపోయింది. బాల్కనీలో కొంత భాగం నేరుగా రెండు అంతస్తుల క్రింద రోడ్డుపై నిలబడిన వారిపై పడింది. శిథిలాలు తలపై పడటంతో కింద నిల్చున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Also:David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. సెహ్వాగ్ ను అధిగమించి టాప్ 5లోకి ఎంట్రీ
अहमदाबाद में रथ यात्रा के दौरान हादसा
बिल्डिंग की तीसरी मंजिल की बालकनी ढही
हादसे में बताया जा रहा है की 11 लोगों के घायल और 1 की मौत होने की ख़बर है …#Ahmedabad #AhmedabadRathYatra #BREAKING #Breaking_News #Gujrat #RathYatra pic.twitter.com/sjdERZHvcJ— Rishav Singh Dhanraj (@rishav_dhanraj) June 20, 2023
దేశంలో రెండవ అతిపెద్ద రథయాత్ర అహ్మదాబాద్‌లోని జమాల్‌పూర్‌లోని జగన్నాథ ఆలయం నుండి ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం 6.30 గంటలకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా అమ్మవారి విగ్రహాలను రథంపై ఉంచారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని మంగళ హారతి చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉదయం 7 గంటలకు పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు.
Read Also:Dimple Hayathi : ఆ భారీ సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ కొట్టేసిన డింపుల్ హయతి…?