డింపుల్ హయతి… ఆమె తెలుగు లో గద్దల కొండ గణేష్ చిత్రం లో చేసిన ఐటెం సాంగ్ తో మంచి గుర్తింపు పొందింది.. ఇప్పుడు డింపుల్ హయతి కి బంపర్ ఆఫర్ వచ్చింది.స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతుంది.డింపుల్ హయతి ఈ మధ్య కాలంలో తెలుగు లో బాగానే పాపులర్ అయింది.. ఈ తెలుగు బ్యూటీ అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు… అందుకే ఈమెకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి… గల్ఫ్ సినిమాతో ఈమె సినీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత హరీష్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ ద్వారా నే బాగా పాపులర్ అయ్యింది.
ఈ సాంగ్ తర్వాతనే ఈమెకు కొన్ని అవకాశాలు కూడా దక్కాయి.. ఇదిలా ఉండగా ఈ మధ్య ఈ అమ్మడి పేరు వైరల్ అయింది. ఎందుకు అంటే . ఒక పోలీస్ కేసు వివాదంలో ఈమె వార్తల్లో నిలిచింది..ఈ భామకు మళ్ళీ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం అయితే దక్కింది అని సమాచారం… కోలీవుడ్ స్టార్ హీరో లోక నాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘ఇండియన్ 2’..ఈ సినిమా షూట్ ఇప్పటికే చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని ఆ సాంగ్ లోనే డింపుల్ హయతి చేయబోతున్నట్టు సమాచారం… ఇక ఈ సాంగ్ లో కమల్ కూడా ఫుల్ మాస్ స్టెప్స్ వేయనున్నట్లు సమాచారం. డింపుల్ కు ఈ ఐటెం సాంగ్ రూపంలో మరో అవకాశం రావడం ఆమె అదృష్టం అనే చెప్పవచ్చు.. మరీ ఈ ఆఫర్ నిజమైతే ఆమె కెరీర్ దూసుకుపోయినట్లే అని తెలుస్తుంది.