‘దొరసాని’తో వెండితెర అరంగేట్రం చేసిన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘పుష్పక విమానం’ నిరాశపరిచినా వరుస సినిమాలతో రాబోతున్నాడు. అందులో భాగంగా త్వరలో ‘హైవే’ సినిమాతో రాబోతున్నాడు. అతి త్వరలో ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదల కానుంది. తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ ‘హైవే’ను విడుదల చేయనుంది. ఇందులో అభిషేక్ బెనర్జీ, మానస ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేస్తూ అతి త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది ఆహా.
కథ విషయానికి వస్తే ఫోటోగ్రాఫర్ అయిన హీరో ఆనంద్ దేవరకొండ, తులసి (మానస) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలోకి ఓ సీరియల్ కిల్లర్ ఎంటర్ అవుతాడు. విషయం తెలిసిన హీరో తన ప్రేయసిని కాపాడుకోగలుగుతాడా? అన్నదే కథాంశం. ఈ సైకలాజకల్ దేవరకొండ, అభిషతక్ బెనరజీ పాత్రలు చాలా కొత్తగా ఉండబోత్ నానయి. ఈ 6న పోస్టర్ ఆవిష్కరించిన ఆహా అతి త్వరలో సినిమాను స్ట్రీమింగ్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది.