Site icon NTV Telugu

Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌ను మహిళా జైలుకు తరలింపు..!

Aghori Srinivas

Aghori Srinivas

అఘోరీ శ్రీనివాస్‌ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. యూపీలో అరెస్ట్ చేసి నిన్న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు పోలీసులు.. అఘోరీ ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. మరో వైపు వర్షిణిని భరోసా సెంటర్‌కు తరలించినట్లు సమాచారం.

READ MORE: Minister Srinivas: కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఐటీ పార్క్‌.. స్థలాన్ని పరిశీలించిన మంత్రి

ఇక రిమాండ్ నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్‌ను ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయనను ట్రాన్స్ జెండర్ ఫీమేల్‌గా గుర్తించారు. దాంతో కంది సబ్ జైలు అధికారులు జైలులోకి ప్రవేశానికి నిరాకరించారు. దానితో పోలీసులు శ్రీనివాస్‌ను మరోసారి వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదిక ఆధారంగా ఆయనను ఏ జైలుకు తరలించాలన్న దానిపై అధికారులు నిర్ం తీసుకున్నారు. చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు.

READ MORE: Vinay Narwal: భార్యతో ఆర్మీ ఆఫీసర్ డ్యాన్స్.. చివరి వీడియోలు వైరల్

Exit mobile version