అఘోరీ శ్రీనివాస్‌ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. యూపీలో అరెస్ట్ చేసి నిన్న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు పోలీసులు.. అఘోరీ ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. మరో వైపు వర్షిణిని భరోసా సెంటర్‌కు తరలించినట్లు సమాచారం.
Aghori Srinivas: రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన అఘోరి శ్రీనివాస్, వర్షిణి కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరికి సంబంధించిన కేసులో అఘోరీ శ్రీనివాస్ ను అరెస్టు చేసిన పోలీసులు, ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్‌ను అరెస్టు చేసి కంది సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే, కంది సబ్ జైలుకు తీసుకువచ్చినప్పుడు అఘోరి శ్రీనివాస్ అరుపులు, కేకలతో హంగామా చేశాడు. వర్షిణిని నా దగ్గరే ఉంచాలి..…