Pravati Parida: మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి.. డిప్యూటీ సీఎం పదవిని సొంత చేసుకున్న ప్రవతి పరిదా
- 2014 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీకి చెందిన సమీర్ రంజన్ దాస్ చేతిలో ఓటమి
- తాజాగా బిజూ జనతాదళ్ నాయకుడు దిలీప్ కుమార్ నాయక్‌పై 4588 ఓట్ల తేడాతో గెలుపు
- పరిదాపై 9 క్రిమినల్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పాటు కొత్త ఒడిశా ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉంటారు. వీరిలో ఒకరు బీజేపీ సీనియర్ నేత కేవీ సింగ్ డియో కాగా, మరొకరు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రవతి పరిదా. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముగ్గురి పేర్లను ప్రకటించారు. ఒడిశాలో తొలిసారిగా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బుధవారం జనతా మైదాన్‌లో అంగరంగ
వైభవంగా జరిగే కార్యక్రమంలో కొత్త ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
READ MORE: Jammu Kashmir: పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
ఒడిశా కొత్త ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ప్రవతి పరిదాకు తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే కీలక బాధ్యతలు అప్పగించారు. నిమాపర అసెంబ్లీ స్థానంలో బిజూ జనతాదళ్ నాయకుడు దిలీప్ కుమార్ నాయక్‌పై 4,588 ఓట్ల తేడాతో ప్రవతి పరిద విజయం సాధించారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీకి చెందిన సమీర్ రంజన్ దాస్ చేతిలో పరిదా భారీ మెజార్టీతో ఓడిపోయారు. 2014లో పరిదా 29,637 ఓట్లు, 2019లో 32 వేలకు పైగా ఓట్లతో ఓటమి చవిచూశారు. 57 ఏళ్ల పరిదా సామాజిక కార్యకర్తగా తనదైన ముద్ర వేశారు. 1995లో ఉత్కల్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. తర్వాత 2005లో అదే యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ పట్టా పొందారు. పరిదాపై 9 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పరిదా కొంతకాలం ఒరిస్సా హైకోర్టులో లా ప్రాక్టీస్ చేశారు. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ప్రవిద మొత్తం ఆస్తుల విలువ రూ.3.6 కోట్లు. ఇందులో రూ.2 కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నాయి. తన మొత్తం ఆదాయం రూ.31.8 లక్షలుగా ప్రకటించారు. రూ.45 లక్షల అప్పు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో ఉంది.
తాజావార్తలు
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!