ఎవరైనా ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఏం చేస్తారు వేరే చోట ఉపాధి చూసుకుంటారు. అయితే ఓ యువతి మాత్రం ఎవరు ఊహించని విధంగా యజమానిపై ప్రతీకారం తీర్చుకుంది. ఆమె ప్రవర్తన నచ్చక ఉద్యోగం నుంచి తీసేసిన యజమాని దంపతుల ప్రైవేట్ వీడియోలను నెట్ లో అప్ లోడ్ చేసింది. ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది. ఈ ఉదంతంలో పోలీసులు ఒక యువతితోపాటు, ఒక అజ్ఞాత వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు.
Also Read: Silk Smita: మేకప్ ఆర్టిస్ట్ కాస్త హీరోయిన్ అయి.. జీవితాంతం ప్రేమకోసం పరితపించిపోయింది
వివరాల ప్రకారం పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ జంట పిజ్జా షాప్ నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఆ జంట ఆ షాపును ప్రారంభించింది. అందులో ఓ యువతి పనికి చేరింది. అయితే ఆమె ప్రవర్తన నచ్చక షాపు యజమాని ఆమెను విధుల నుంచి తొలగించాడు. దీంతో అతనిపై కక్ష గట్టిన ఆ యువతిని అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. పిజ్జాషాపు యజమాని జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను నెట్టింట్లో వైరల్ చేసింది. అంతేకాకుండా ఆ షాపు ఓనర్ నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. పిజ్జా షాపులో గతంలో పనిచేసిన తనీషా అనే అమ్మాయే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి, ఆ దుకాణయజమాని దంపతులకు చెందిన ప్రైవేట్ వీడియో వైరల్ చేసిందని తేలింది. దీంతో ఆమెతో పాటు ఒక అజ్ఞాత వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ మధ్య కాలంలో వారు నాలుగు వీడియోలు వైరల్ చేశారని, వాటిలో ఒక వీడియో అభ్యంతరకరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకున్న పోలీసుల తమదైన శైలిలో విచారిస్తున్నారు. పని చేస్తున్నట్లు నటించి యజమానుల ప్రైవేట్ వీడియోలు తీసింది అంటే ఆమె ఎంత డేంజరో అంటూ అక్కడున్న వారు చర్చించుకుంటున్నారు.