Atrocious: మహిళపట్ల జరిగే అఘాయిత్యాలు అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నాయి. కానీ, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కొంత మంది మగాళ్లు మృగాళ్లుగా మారి విరుచుకుపడుతున్నారు. ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిని కిడ్నాప్ చేసి మరీ వాళ్ల కామవాంఛ తీర్చుకుంటున్నారు. మనుషులలాగా కాకుండా మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్లలు అని చూడకుండా తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు కొంతమంది దుర్మార్గులు. వాళ్ల పసి హృదయాలను మొగ్గ దశలోనే తుంచేస్తున్నారు. చనిపోయిన మృతదేహాన్ని కూడా వదలడం లేదు. అలాంటే అమానవీయ ఘటన తాజాగదా అస్సాంలో చోటుచేసుకుంది.
Also Read: ICC World Cup 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు బెదిరింపు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై కేసు నమోదు..
హత్యానంతరం మృతదేహంతో కిరాతక చర్యలకు పాల్పడిన ఉదంతం అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో వెలుగు చూసింది. కరీంగంజ్‌లో మైనర్ బాలికను గొంతుకోసి హత్య చేసి, ఆపై మృతదేహంపై అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులను అస్సాం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు రైల్వే ఉద్యోగి. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 9న కరీంగంజ్ టౌన్ బైపాస్ సమీపంలో మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. అదే రోజు మైనర్ బాలిక హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని కరీంనగర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పార్థ ప్రతిమ్ దాస్ తెలిపారు. ముగ్గురు నిందితులు బాధితురాలి ఇంట్లోకి బలవంతంగా చొరబడి హత్య చేశారు. తర్వాత ఆమె మృతదేహంతో వారి కామవాంఛను తీర్చుకున్నారు.
Also Read: Lifestyle : మగవాళ్ళు ఇది మీకోసమే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు అమ్మాయిలు పడిపోతారు..
ఎస్పీ పార్థ ప్రతిమ్ దాస్ మాట్లాడుతూ, “సెప్టెంబర్ 9న మెడల్ పార్ట్ -1 నుంచి సంఘటన గురించి సమాచారం అందింది. అక్కడికి వెళ్లేచూసేసరికి ఆ ఇంట్లోమైనర్ బాలిక మృతదేహం కనిపించింది. ఘటన జరిగినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరు. మైనర్ బాలిక మృతదేహానికి సిల్చార్ మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం నిర్వహించారు. దీని ఆధారంగా పోలీసులు సెక్షన్ 376(A) కింద కేసు నమోదు చేశాం. దీంతో పాటు నిందితులపై ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశాం.” అని వెల్లడింతారు. చనిపోయిన బాలిక నోట్‌బుక్ నుంచి పోలీసులు మొబైల్ నంబర్‌ను పోలీసులు గుర్తించారు ఆ మొబైల్ నంబర్ ఆధారంగా బిప్లబ్ పాల్, శుభ్ర మలాకర్, రాహుల్ దాస్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణలో రాహుల్ దాస్ బాధిత బాలికతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించాడని వెల్లడించాడు. అమ్మాయి వ్యతిరేకించడంతో రాహుల్ ఈ నీచమైన ఉద్దేశంతో దారుణానికి పాల్పడినట్లు తెలిసింది.
Also Read: Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్‌కు ముందు ఈ సంస్థపై కాసుల వర్షం.. ఒక్క నెలలో రూ. 49000 కోట్లు
అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులు సెప్టెంబర్ 9న బాలిక ఇంట్లోకి వెళ్లడానికి కుట్ర పన్నారని, ఆమెతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించారని కరీంగంజ్ ఎస్పీ పార్థ ప్రతిమ్ దాస్ తెలిపారు. వారు రాత్రి 11:30 గంటలకు ఆమె ఇంటికి వెళ్లారని చెప్పారు. వారు గదిలోకి ప్రవేశించారని, ఆమెను గొంతుకోసి చంపినట్లు ఆయన వెల్లడించారు. బాలికను చంపేసిన తర్వాత వారు బాలిక మృతదేహంపై అఘాయిత్యానికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎస్పీ చెప్పారు. మొబైల్ నంబర్ దొరకడంతో అన్ని ఆధారాలు లభించాయని ఎస్పీ పేర్కొన్నారు.
రైల్వే ఉద్యోగి సూత్రధారి
రాహుల్ దాస్ రైల్వేలో నాల్గవ తరగతి ఉద్యోగి అని, ఈ కేసుకు ప్రధాన సూత్రధారి కూడా అని, రాహుల్ దాస్ శుభ్ర మలాకర్ నుంచి రెండు మొబైల్ సిమ్ కార్డులు తీసుకున్నారని, వీటిని రాహుల్ మలాకర్, బాధిత బాలిక వినియోగించారని ఎస్పీ దాస్ తెలిపారు. నెలల తరబడి నిరంతరం టచ్‌లో ఉన్నారని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.