బంజారాహిల్స్ ఆఫ్టర్ నైన్ పబ్ లో గలీజ్ దందా నడుస్తోంది. యువకులను ఆకర్షించేందుకై పాడు పనులు యజమాన్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను పిలిపించి ఈ దందాను యాజమాన్యం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉపాధి పేరుతో యువతలను ఇక్కడ రప్పించి వ్యభిచార రొంపులోకి యాజమాన్యం దింపుతున్నట్లు తెలుస్తోంది. యువతులతో అశ్లీల నృత్యాలతో పాటు అక్రమ వ్యాపారం యాజమాన్యం చేయిస్తున్నట్లుగా సమాచారం.
Also Read: Kadiyam Srihari: ప్రస్తుత రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ లేచే పరిస్థితి లేదు..
ఆఫ్టర్ నైన్ పబ్బులో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక సోదాలు చేసిన సమయలో 130 మంది యువకులని పోలీసులు పట్టుకున్నారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న 30 మంది యువతులను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఉపాధి పేరుతోటి ఇతర రాష్ట్రాల నుంచి యువతలను ఇక్కడకి రప్పించి పబ్బు యాజమాన్యం ఈ పాడుపనులను చేస్తుంది. ఈ సందర్బంగా పబ్ లో పట్టుబడిన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించ్చారు పోలీసులు.
Also Read: Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
30 మంది యువతులను రెస్క్యూ హోమ్ కి తరలించిన పోలీసులు., అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన ఆఫ్టర్ నైన్ పబ్బు పై క్రిమినల్ కేసు నమోదు చేసారు. ఎక్సైజ్ అధికారులతో చర్చించి పబ్ ను శాశ్వతముగా మూసి వేస్తామని పోలీసులు తెలిపారు.