ఏడు దశాబ్దల తరువాత గ్రామానికి నీటి సదుపాయం.. కానీ అంతలోనే సీన్ మారిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఊరు ఇప్పటికే చాలా కష్టాలు పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఎటువంటి సదుపాయాలకు నోచుకోలేదు. కనీసం నిత్యవసరం అయిన నీరు కూడా ఆ గ్రామస్తులకు అందడం లేదు. ఏదో ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొని వచ్చి మూడు రోజులకొకసారి ఇస్తున్నారు. అది కూడా కేవలం 15 లీటర్లు మాత్రమే ఇస్తారు. వాటినే వారు మూడు రోజుల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అంటే రోజుకు కేవలం 5 లీటర్ల నీటిని మాత్రమే కుటుంబం మొత్తం వాడుకోవాల్సి ఉంటుంది. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్ జిల్లా లహురియాదహ్ గ్రామస్థుల పరిస్థితి. వీరి గ్రామం కష్టాలు వింటే ఎలా బతుకుతున్నారో అనిపిస్తుంది కదా.
Also Read: Kerala High Court: స్విగ్గీ, జోమాటోలు వద్దు.. పిల్లల్ని తల్లి వండిన ఆహారం రుచిచూడనివ్వండి..
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
అందుకే దేవుడి రూపంలో ఆ జిల్లా కలెక్టర్ అన్నేళ్ల నుంచి వారు అనుభవిస్తున్న కష్టాలకు దారి చూపించాడు. ఈ కష్టాలు చూసి స్పందించిన మీర్జాపుర్ కలెక్టర్ దివ్యా మిత్తల్ ఇంటింటికీ తాగునీరు అందించే పథకం ‘జల్‌జీవన్ మిషన్’ కింద గ్రామంలో మంచి నీటి పైపులు, కుళాయిలు ఏర్పాటు చేయించారు. ఆగస్టు 29న గ్రామంలో కొళాయిలు ఏర్పాటు జరిగింది. అయితే ఇది జరిగిన మూడు రోజులకే జిల్లా కలెక్టర్ బదిలీ అయ్యారు. ఆ తరువాత వారికి నీరు రావడం ఆగిపోయింది. అయితే దీనంతటికి కారణం జల్‌జీవన్ మిషన్ ప్రారంభోత్సవానికి తమను పిలవకుండా కలెక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని స్థానిక నేతలకు ఆగ్రహం వచ్చింది. వారి తరుపు వారు గ్రామానికి మంచి నీరు వచ్చే పైపులను కట్ చేసేశారు. దీంతో కష్టాలు తీరాయి అనుకుంటే పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చేసింది. ఈ గ్రామం కథ వింటుంటే ఏదో సినిమాలో చూసినట్టు ఉంది కదా. అప్పటి వరకు మిగిలిన గ్రామస్థులతో పాటు మంచినీటి కష్టాలు పడిన స్థానిక నేతలు కూడా ఇలా చేస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రజలు వాపోతున్నారు.
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..