Site icon NTV Telugu

AFG vs SL: శ్రీలంకపై ఆఫ్ఘానిస్తాన్ గెలుపు.. మరో సంచలన విజయం

Afg Won

Afg Won

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పూణే వేదికగా జరిగిన అఫ్గానిస్తాన్‌- శ్రీలంక మ్యాచ్ లో మరో సంచలన విజయం నమోదు చేసుకుంది. శ్రీలంకను 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌ ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులు చేసింది. ఆ తర్వాత 242 పరుగుల లక్ష్యంతో రంగలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ 45.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి శ్రీలంకను చిత్తుగా ఓడించింది.

Read Also: SAINDHAV : వైరల్ అవుతున్న ఫస్ట్ సింగిల్ పోస్టర్..

ఆఫ్గాన్‌ బ్యాటర్లలో ఒమర్జాయ్‌ (72 నాటౌట్‌), రెహమత్‌ షా(62), హష్మతుల్లా షాహిదీ(58 నాటౌట్‌) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక మ్యాచ్లో శ్రీలంక బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరచలేకపోయారు. దీంతో మరో విజయాన్ని శ్రీలంక జట్టు ఖాతాలో వేసుకుంది. లంక బౌలర్లలో మధుశంక రెండు వికెట్లు పడగొట్టగా, రజితా ఒక్క వికెట్‌ సాధించారు.

Read Also: Viral Video: ఏంటీ బాసూ.. బాలు కొడితే సిక్స్ పోవాలి కానీ, పార్ట్నర్ను కొట్టావు.. వీడియో వైరల్

తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సంక(46),కుశాల్‌ మెండిస్‌ (39), సమరవిక్రమ (36) పరుగులు చేసి ఆఫ్ఘాన్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు. ఇక.. ఆఫ్ఘన్‌ బౌలర్లలో ఫజల్‌ హక్‌ ఫారూఖీ 4 వికెట్లు పడగొట్టాడు. ముజీబ్‌ రెహ్మాన్‌ 2, రషీద్‌ ఖాన్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఆఫ్ఘాన్ తాజా విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి ఎగబాకింది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌లలో శ్రీలంకను అఫ్గానిస్తాన్‌ ఓడించడం ఇదే తొలిసారి. ఈ ప్రపంచ కప్ లో ఇంతకుముందు ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ వంటి బలమైన జట్లను అఫ్గాన్‌ ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Exit mobile version