వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పూణే వేదికగా జరిగిన అఫ్గానిస్తాన్- శ్రీలంక మ్యాచ్ లో మరో సంచలన విజయం నమోదు చేసుకుంది. శ్రీలంకను 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ఓడించింది.
వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్ మరో సంచలన విజయం సాధించింది. ఇంతకుముందు సౌతాఫ్రికాను ఓడించి రికార్డ్ సాధించిన.. డచ్ జట్టు, తాజాగా బంగ్లాను ఓడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 230 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 142 పరుగులకు ఆలౌట్ అయింది.
వన్డే వరల్డ్ కప్లో మరో సంచలన విజయం నమోదైంది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై అఫ్ఘాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. 283 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘన్ 49 ఓవర్లలో సునాయాసంగా చేధించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది.