SA vs AFG: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని చారిత్రాత్మక షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు బుధవారం కొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే చరిత్రలో దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇదే తొలి విజయం. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ మొదట బౌలింగ్ చేసి ఆఫ్రికన్ జట్టును కేవలం 106 పరుగులకే కట్టడి చేసి, ఆపై కేవలం 26 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టు నేడే.. భారత తుది జట్టులో ఎవరెవరు? మూడో స్పిన్నర్‌గా యువ బ్యాటర్
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఫాస్ట్ బౌలర్ ఫజల్హాక్ ఫరూఖీ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టులో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. అఫ్గానిస్థాన్ తరఫున యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అఫ్గానిస్థాన్ ఇంతకుముందు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాను ఓడించడంలో విఫలమైంది. కానీ బుధవారం దక్షిణాఫ్రికాతో వన్డేలో తొలిసారి విజయం సాధించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ 250వ వన్డే మ్యాచ్. షార్జా క్రికెట్ స్టేడియం 1984లో ఆసియా కప్ సందర్భంగా శ్రీలంకతో పాకిస్థాన్‌తో తలపడిన సమయంలో ప్రారంభించబడింది. అప్పటి నుండి, ఈ స్టేడియం రికార్డు స్థాయిలో 249 ODI మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు 250 ODI మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించింది.
Train Accident : మధురలో పట్టాలు తప్పిన రైలు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం
తొలుత బౌలింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 33.3 ఓవర్లలో 106 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్ చేసింది. వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇది నాలుగో అత్యల్ప స్కోరు. ఆఫ్ఘనిస్థాన్‌పై టాప్ టెన్ ర్యాంక్ జట్లలో దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోరుకే ఔటైంది. 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు కూడా 15 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే రియాజ్ హసన్ (16), కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (16), అజ్మతుల్లా ఉమర్జాయ్ (25 నాటౌట్), గుల్బాదిన్ నైబ్ (34) రాణించడంతో జట్టు 26 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శుక్రవారం ఇదే మైదానంలో ఇరు జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.