Mamagaru Telecasting in Star Maa: సెప్టెంబర్ 11 నుంచి ‘స్టార్ మా’లో కొత్త సీరియల్ మొదలైంది. మామగారు అనే పేరుతో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుందని చెబుతున్నారు.. ఈ సీరియల్, అహంకారానికి – ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని, ఉన్నత ఉద్యోగం చేసి వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే గంగ అనే యువతి బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. మరో పక్క ఊరిలో ఓ పెద్ద మనిషిగా పేరున్న కుటుంబానికి చెందిన చెంగయ్య, తన మాటే చెల్లుబాటు కావాలనుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆయన మూడో కుమారుడైన గంగాధరన్‌కు చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నతనంలోనే ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుంటాడు. తండ్రి చేత తిట్లు తినే అతను, ఈ బాధల నుంచి విముక్తి కావాలనుకుంటూ తప్పుడు సర్టిఫికెట్లు తో దుబాయ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తే అతను ఫేక్ చేయాలనుకున్నది గంగకు చెందిన సర్టిఫికేట్‌లు కావటం, ఈ విషయం తెలిసి గంగ ఫిర్యాదు చేయటంతో , ప్రభుత్వం గంగాధరన్ పాస్‌పోర్ట్‌ను బ్యాన్ చేస్తుంది. పెళ్లి చేస్తే అయినా తమ కుమారుడు గంగాధరన్ మారతాడని భావించి, చెంగయ్య తన సోదరి కుమార్తె సుభద్రతో వివాహం చేయాలని అనుకుంటే ఆమె చేసుకోనని షాక్ ఇస్తుంది.
Pallavi Prashanth: ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా.. ఓవర్ యాక్షన్..
అయినప్పటికీ చెంగయ్య పెళ్లికి ఏర్పాట్లు చేసి తన స్నేహితుడి కుమార్తె గంగతో గంగాధరన్ పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో గంగ తండ్రికి ప్రాణాపాయ స్థితి ఏర్పడటం, డబ్బుకు ఇబ్బంది పడుతున్న గంగకు ధన సహాయం చేసి ఆమె తండ్రిని కాపాడి బదులుగా తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. కూతురును చెంగయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చిన గంగ తండ్రి, పెళ్లయ్యాక కూడా గంగను చదివించాలని అంటే ఇంట్లో ఆడపిల్లలెవరూ పెద్దగా చదువుకోకూడదని నిషేధం విధించిన చెంగయ్య ,అప్పటికి మాతరం సరేనంటూ తల ఊపుతాడు. నిజానికి పితృ స్వామ్య స్వభావం నరనరాన జీర్ణించుకున్న చెంగయ్య, తన భార్య డాక్టర్ అనే సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియ నియ్యడు అంటే అలాంటి వాడు తన కోడలిని చదువుకోనిస్తాడా ? ఇక ఈ క్రమంలో తానెవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా తెలియని గంగాధరన్, మంగళసూత్రం కట్టేటప్పుడు గంగ ముఖం చూస్తాడు. తన దుబాయ్ కలలు కల్లలు కావటానికి కారణమైన గంగను భార్యగా గంగాధరన్ అంగీకరించాడా ? పెద్ద ఇంటికి కోడలు కావాలనే కల సాకారమైనందుకు సంతోషంగా కొత్త ఇంటికి అడుగు పెట్టిన గంగ , ఒక వైపు తనను అసహ్యించుకునే భర్త, మరోవైపు స్త్రీలను బానిసలుగా భావించే మామగారు… నడుమ తన కలను సాకారం చేసుకోవటానికి ఎలా పోరాడుతుంది ? అనేది ఇంట్రెస్టింగ్ గా చూపించుచున్నారు.