ISRO : నేడు ఎల్-1 పాయింట్‌కి చేరుకోనున్న ఆదిత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత మిషన్ ‘ఆదిత్య’ను పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిని ఇస్రో 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఈ రోజు నిలిపేందుకు అన్ని సన్నాహాలు చేసింది. L పాయింట్ భూమి, సూర్యుని మధ్య ఉన్న మొత్తం దూరంలో దాదాపు ఒక శాతం. ఆదిత్య సోలార్ అబ్జర్వేటరీని గత ఏడాది సెప్టెంబర్ 2న సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో పంపింది.
భూమి, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సున్నాగా మారే లేదా నిష్క్రియంగా మారే ప్రాంతాన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. ఆదిత్య హాలో కక్ష్యకు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి సూర్యుడిని నిరంతరం పర్యవేక్షించి దానికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని హాలో పాయింట్ నుండి బాగా అంచనా వేయవచ్చని ఇస్రో తెలిపింది.
Also Read
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
ఆదిత్య-ఎల్1ని శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎల్1 చుట్టూ హాలో కక్ష్యలో ఉంచుతామని ఇస్రో అధికారి ఒకరు శుక్రవారం పిటిఐకి తెలిపారు. ఇది చేయకపోతే ఆదిత్య సూర్యుడి వైపు ప్రయాణం కొనసాగించే అవకాశం ఉందని అధికారి తెలిపారు. ఆదిత్య ఎల్-1 అన్ని టెస్టుల్లో పాస్, భూ ప్రభావ పరిధి నుంచి తప్పించుకుని లాగ్రేంజ్ పాయింట్ 1 వైపు వెళ్లినట్లు ఆయన తెలిపారు.
Read Also:Karnataka: సైన్‌బోర్డ్‌లపై 60 శాతం మాతృ భాష.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
ఆదిత్య L1 మిషన్ లక్ష్యం ఏమిటి?
ఇస్రో ప్రకారం, ఈ మిషన్ ప్రధాన లక్ష్యం సౌర వ్యవస్థలో సూర్యుని ఉష్ణోగ్రత, సూర్యుని ఉపరితలంపై జరిగే కార్యకలాపాలు, సూర్యుని మంటలకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు భూమికి సమీపంలో వాతావరణ సంబంధిత సమస్యలను అర్థం చేసుకోవడం. ఇస్రో మిషన్‌కు దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసింది.
ఆదిత్య L1లో ఏడు పేలోడ్‌లు
ఆదిత్య L1 ఏడు సైంటిఫిక్ పేలోడ్‌లతో అమర్చబడి ఉంది. ఈ పేలోడ్‌లన్నీ ఇస్రో, జాతీయ పరిశోధనా ప్రయోగశాలలచే స్వదేశీంగా అభివృద్ధి చేయబడ్డాయి. ఈ పేలోడ్‌లు విద్యుదయస్కాంత కణం, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్‌లను ఉపయోగించి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని వెలుపలి పొర (కరోనా)ను గమనించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
Read Also:Mahadev Betting App : భూపేష్ బఘేల్ రూ.508 కోట్లు తీసుకున్నాడు… ఈడీ ఛార్జిషీట్‌లో వెల్లడి
తాజావార్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!