Adipurush release date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ‘ఆదిపురుష్’ చిత్రబృందం. కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఖుషీ చేసింది. ఓంరౌత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది జూన్ 16న విడుదల చేస్తున్నట్లు సోమవారం ఉదయం క్లారిటీ ఇచ్చేసింది. ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. సీతగా కృతి సనన్ కనిపించబోతోంది. ఇక రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అయితే.. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పునరాలోచనలో పడిన ‘ఆదిపురుష్’ టీమ్.. కాస్త లేట్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
Read Also: Anu Emmanuel Reveal Secret: అమ్మ ఫీలైందని.. శిరీష్‌తో డేటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన అనూ
నిజానికి ఈ సినిమాను తొలుత 2023, జనవరి 12న విడుదల చేస్తామని ప్రకటించింది టీం. రిలీజ్ చేసిన టీజర్ పేలవంగా ఉండి.. విమర్శల పాలుకావడంతో మళ్లీ సందిగ్ధంలోపడింది. టీజర్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా.. టీజర్‌లో కనిపించిన వీఎఫ్‌ఎక్స్‌పై వచ్చిన జోక్‌లు ఈ మధ్య కాలంలో ఏ సినిమా గురించి రాలేదు. దాంతో వీఎఫ్‌ఎక్స్, సీజీ వర్క్ కోసం రూ.100 కోట్లని అదనంగా ‘ఆదిపురుష్’ టీమ్ ఖర్చు చేయబోతోంది. ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో వచ్చే సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.
We are announcing the new release date of our upcoming movie 'Adipurush'! #Adipurush on 16th June, 2023!#Prabhas @omraut #SaifAliKhan @mesunnysingh #Pramod #Vamsi #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir @TSeries @UV_Creations pic.twitter.com/MaOK8aN2Wt
— UV Creations (@UV_Creations) November 7, 2022