Adi Srinivas: ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది..
- పాడి కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయాలు చేస్తున్నారు
- లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని బూడిదలాగ అయినాక బూడిద రాజకీయం చేస్తుంది
- మీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరు
- రైతు భరోసాను మీరు గతంలో జూన్
- జులైలో వేశారు
- రైతు రుణమాఫీ ఆగస్టు 15లోపు చేసి తీరుతాం - ఆది శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక, ఎర్రమట్టి దందా యథేచ్ఛగా నడిపారని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని బూడిదలాగ అయినాక బూడిద రాజకీయం చేస్తుందని విమర్శించారు. రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న మీరు.. 10 ఏళ్లలో ఎంత సంపాదించారు? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీపీసీ పనులు ప్రారంభించిన నాటి నుండి బూడిదను రైతులకు ఉచితంగా ఇచ్చామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై రూ. 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా దోపిడి చేసింది మీరు కాదా? అని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Odisha Swearing-In: ఒడిశా సీఎం ప్రమాణస్వీకారానికి “పూరీ జగన్నాథుడికి” బీజేపీ తొలి ఆహ్వానం..
Also Read
పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం పోరాడిండని కేసీఆర్ పొగిడిన సంగతి మరిచారా? అని బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రైతు భరోసాను బీఆర్ఎస్ గతంలో జూన్, జులైలో వేశారని తెలిపారు. మీ అవినీతి, అక్రమాల గురించి విచారణ జరుగుతుందని.. విచారణకు పాడి కౌశిక్ రెడ్డి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఆగస్టు 15లోపు చేసి తీరుతామని అన్నారు. హరీష్ మాట మార్చి రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అని రాజీనామా పై మాట్లాడుతుండని పేర్కొన్నారు. మీ దగ్గర ఎమ్మెల్యేలు 39 అని చెబుతున్నారు కాని.. సున్నా కాబోతోందని తెలుసుకోండని ఆది శ్రీనివాస్ తెలిపారు.
Mumbai: భారత్ లోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు.. నకిలీ పత్రాలు సృష్టించి ఓటు సైతం వేసినట్లు గుర్తింపు
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు నిరాధారం.. బేస్ లెస్ ఆరోపణలు పొన్నం ప్రభాకర్ పై చేస్తున్నాడని మండిపడ్డారు. భార్య పిల్లల పేరుతో రాజకీయాలు చేసే నీచ స్థాయికి దిగజారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తెరవెనుక ఉండి మాట్లాడిస్తున్నారని.. పొన్నం ప్రభాకర్ కు కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు