టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినీ కెరియర్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన సినిమాలను తిరిగి 4కె వెర్షన్ ప్రింట్ తో థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ రీ రిలీజ్ కి సిద్ధం అయిపోయింది.జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అదుర్స్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నవంబర్ 18, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రీ రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వల్లభనేని వంశీ మరియు కొడాలి నాని నిర్మించిన ఈ చిత్రంలో నయనతార మరియు షీలాలు హీరోయిన్ లుగా నటించారు.
అలాగే ఈ చిత్రం లో నరసింహ పాత్రలో అలాగే చారి పాత్ర లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించారు. 13 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.ఈ సినిమా 4k వెర్షన్ తో నవంబర్ 18న మళ్ళీ విడుదల కాబోతోందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో భట్టాచారి గా బ్రహ్మానందం అదిరిపోయే కామెడీ పాత్రలో నటించి మెప్పించారు. తన మార్క్ కామెడీ తో అదరగొట్టేశారు. చారి భట్టు కాంబినేషన్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి.2010లో విడుదలైన అదుర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ ,వి వి వినాయక్ లకు మంచి గుర్తింపు లభించింది