Congress: బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి రాజీనామా
- బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి రాజీనామా
- లోక్‌సభ ఎన్నికల్లో యూసుఫ్ పఠాన్ చేతిలో పరాజయం
- బహరంపూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా ఉన్న రంజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమబెంగాల్‌లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు. బహరంపూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్‌పై దాదాపు 85,022 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాపై పార్టీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం బెంగాల్ సచివాలయంలో సీఎం మమతా బెనర్జీతో 35 నిమిషాల పాటు సమావేశం అయిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బహరంపూర్ నియోజకవర్గం నుంచి అధీర్ రంజన్ చౌదరి ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ఇది కూడా చదవండి: Minister Narayana: అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో త్వరలో చెప్తాం..
Also Read
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు లేకుండానే కాంగ్రెస్, టీఎంసీ వేర్వేరుగా ఎన్నికలకు వెళ్లాయి. అధీర్ రంజన్ వైఖరి వల్లే తాము ఒంటరిగా పోటీకి వెళ్లాల్సి వచ్చిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అప్పట్లో ఆరోపించగా, కాంగ్రెస్‌కు గండికొట్టే ఆలోచనలో మమత ఉన్నారంటూ అధీర్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడటంతో పాటు యూసుఫ్ పఠాన్ చేతిలో అధీర్ రంజన్ ఓడిపోయారు. తనను ఓడించేందుకు మమత పన్నిని వ్యూహం ఫలించిందంటూ దీనిపై అధీర్ రంజన్ వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని మతవిశ్వాసాల వారు తనకు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారని అన్నారు. అయితే వరుసగా ఆరోసారి బహరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచేందుకు తగినన్ని ఓట్లు రాలేదని చెప్పారు. 1999 నుంచి బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా అధీర్ రంజన్ ఉన్నారు. అధీర్ రంజన్ వారసుడిగా ఇషా ఖాన్ చౌదరిని నియమించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Hajj pilgrimage: హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మృతి..
తాజావార్తలు
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!