Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Harassment Case: నాసిక్‌లో సంచలనం సృష్టించిన టీసీఎస్ (TCS) లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి కేసులో తాజాగా దాఖలైన చార్జ్‌షీట్ పలు షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చింది. నిందితులు కేవలం మతమార్పిడికే పరిమితం కాకుండా, బాధితురాలి పేరు మార్చి కొత్త గుర్తింపు ఇవ్వాలని, ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచాలని పక్కాగా ప్లాన్ చేశారు. మలేగావ్‌కు చెందిన ఒక టీమ్ ద్వారా మతమార్పిడికి సంబంధించిన నకిలీ పత్రాలను సిద్ధం చేయవచ్చని నిందితుడు తౌసిఫ్ చెప్పడంతో బాధితురాలు తన విద్యా, ఇతర అసలు పత్రాలను నిందితుడు డానిష్ బ్యాగ్‌లో పెట్టింది. ఒకవేళ ఇంట్లో తెలిస్తే ఎలా అని బాధితురాలు ఆందోళన చెందగా.. కొత్త పేరుతో డాక్యుమెంట్లు వచ్చాక ఉద్యోగం నిమిత్తం రెండేళ్లు బయటకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి, ముంబైకి మారిపోయి కుటుంబానికి పూర్తిగా దూరంగా ఉండాలని డానిష్ సలహా ఇచ్చాడు. పరిస్థితి విషమిస్తే ఆమెను మలేషియా పంపేందుకు సైతం నిందితుడు తౌసిఫ్ ప్రతిపాదించాడు, అక్కడ తన బంధువుల ఇంట్లో ఉంటూ ఇస్లాం పద్ధతులు పాటిస్తూ, ఇక్కడి వారితో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఉండాలని ప్లాన్ చేశారు.
కాగా, ఫిబ్రవరి 2026లో బాధితురాలికి ఒక అపరిచిత నంబర్ నుంచి వాట్సాప్ కాల్స్ రావడంతో, డానిష్‌ను గట్టిగా నిలదీయగా.. తనకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారనే నిజాన్ని ఒప్పుకున్నాడు. నిజం చెబితే వదిలేస్తావనే భయంతోనే ఇన్నాళ్లూ దాచానని చెప్పడంతో ఆమె షాక్‌కు గురైంది. ఆ తర్వాత డానిష్ తన భార్య మాహిరిన్తో మాట్లాడించగా, ఆమె బాధితురాలిని కలిసి ఇస్లాం పద్ధతుల గురించి చెబుతానని పేర్కొంది. కానీ బాధితురాలు నిరాకరించింది. అయితే, తన కొత్త పేరు, గుర్తింపు అప్పటికే కొందరికి తెలియడంతో దీని వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం ఆమెకు బలపడింది. పెళ్లయిన నీతో నా పెళ్లెలా సాధ్యమని బాధితురాలు ప్రశ్నించగా, తమ సమాజంలో బహుభార్యత్వం ఉందంటూ.. ఎవరూ దొరక్కపోతే తమ ‘ఇమామ్ సాబ్’ను పెళ్లి చేసుకోవచ్చని డానిష్ చెప్పాడు. ఆ ఇమామ్ భార్య మదర్సాలో చదువు చెబుతుందని, ఆమె ద్వారా ఇస్లాం, అరబిక్ నేర్చుకోవచ్చని వివరించాడు. ఇక, గత చార్జ్‌షీట్‌లోనూ మానసిక ఒత్తిడి తగ్గిస్తామనే నెపంతో తనకు మతపరమైన వీడియోలు, సాహిత్యాన్ని చూపించి ప్రభావితం చేశారని, డానిష్ పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఇప్పటికే ఆరోపించింది. ప్రస్తుతం నాసిక్‌లోని దేవ్లాలీ క్యాంప్ పోలీస్ స్టేషన్లో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, నిదా ఖాన్‌లపై నమోదైన ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది. 100 మందికి పైగా సాక్షుల స్టేట్మెంట్లతో దాఖలైన ఈ చార్జ్‌షీట్‌లోని ఆరోపణల నిజానిజాలు కోర్టు విచారణ, సాక్ష్యాధారాల పరిశీలన తర్వాతే తేలనున్నాయి.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!