Rajinikanth-Sathyaraj: విభేదాలకు ముగింపు.. కలిసిపోయిన రజనీకాంత్, సత్యరాజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth and Sathyaraj end Feud: సూపర్ స్టార్ రజనీకాంత్, సీనియర్ నటుడు సత్యరాజ్ తమ విభేదాలకు ముగింపు పలికి.. కలిసిపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’లో రజనీకాంత్, సత్యరాజ్ నటిస్తున్నారట. రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
1986లో కావేరీ జల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి నటించలేదు. చివరిసారిగా 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’లో తండ్రీకొడుకులుగా వీరు నటించారు. తాజాగా కూలీ’లో నటించేందుకు రజనీకాంత్, సత్యరాజ్‌లను లోకేశ్ కనగరాజ్ ఒప్పించాడు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన శివాజీ చిత్రంలో మొదట సత్యరాజ్‌ని విలన్‌గా తీసుకున్నారు. కానీ అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో ఆ పాత్ర సుమన్ చేశారు.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
Also Read: Nandamuri Balakrishna: ఎన్టీఆర్ అంటే ఓ శక్తి.. తెలుగువారికి ఆరాధ్య దైవం!
గతేడాది ‘జైలర్’తో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఏడాది ‘లాల్ సలామ్’తో అభిమానుల్ని నిరాశ పరిచాడు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రజనీకి జోడీగా శోభన నటించనున్నారు. కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ‘లియో’ తర్వాత లోకేశ్ కనగరాజ్ చేస్తోన్న చిత్రమిదే.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి