టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ అందరికి సుపరిచితమే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించి తోలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత భరత్ అనే నేను, గీత గోవిందం, హుషారు, జాతిరత్నాలు సినిమాలతో స్టార్ కమెడియన్ గా మారాడు రాహుల్ రామకృష్ణ. RRRలోను కీలకమైన పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా ఈ హాస్య నటుడి వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం రాహుల్ చేసిన ట్వీట్స్. రాహుల్ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో మహాత్మా గాంధీ పై నిప్పులు చెరిగారు.
Also Read : OG : రూ. 500 కోట్ల మార్క్ ను OG అందుకోవడం కష్టమే
‘మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని, డబుల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నానని కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. అలాగే ను విసిగిపోయాను, నన్ను చంపేయండి”, “హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అని బీఆర్ యస్ అధినేత కేసీఆర్ అను ట్యాగ్ చేసి మరొక ట్వీట్ చేసాడు. ఈ రెండు అనుకుంటే ‘గాంధీ సాధువు కాదు.. అతను మహాత్ముడే కాదంటూ’ (Gandhi not a saint) మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. గాంధీ జయంతి రోజు అయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఈ కామెంట్స్ చేసిన కొన్ని గంటల తర్వాత రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ను డియాక్టీవేట్ చేయడం విశేషం. అయితే కొందరు రాజకీయ నాయకులు రాహుల్ ను బెదిరించారని అందుకే అకౌంట్ డిలీట్ చేసాడని, ఈ సమాజంలో తప్పుని తప్పు అని చెప్పే ఇలాగే బెదిరిస్తారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.