NTV Telugu Site icon

Andhrapradesh: రబీకి అవసరమైన సాగునీటి విడుదలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం

Irrigation

Irrigation

Andhrapradesh: రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఇందుకు రైతుల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తం చేస్తున్నామని అని బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ , హోం మంత్రి తానేటి వనితలు పేర్కొన్నారు. రాజమండ్రి కలెక్టరేట్‌లో రబీకి అవసరమైన సాగు నీరు (డిసెంబర్- 23 నుండి మార్చి-24 వరకు) సరఫరా కార్యాచరణ ప్రణాళిక పై జిల్లా స్థాయి నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ , హోం మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథి హజరవ్వగా, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, ఎంపీ మార్గాని భరత్ రామ్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే లు జక్కంపూడి రాజా , సత్తి సూర్యనారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అధ్యక్షతన జరిగింది.

Also Read: BV Raghavulu: తెలంగాణలో సీపీఐ, సీపీఎం విడిపోలేదు.. బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో వరికి అనుకూలంగా ఉన్న 64,361 ఎకరాల సాగు విస్తీర్ణం కలిగిన భూములకు సాగునీరు అందించే క్రమంలో నీటి ఎద్దడి వచ్చినా ఎదుర్కునే విధంగా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏ ఒక్క ఎకరా భూమి కూడా నీటి లభ్యత లేని కారణంగా పంట వెయ్యకుండా ఉండకూడదని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అవసరమైన నిధులను సమకూర్చడం జరుగుతుందని హామీ ఇచ్చారన్నారు. నీటి లభ్యత ఎక్కడ ఉంది, వాటిని ఎలా సమీకరించి రైతుకి ఏ విధంగా బాసటగా నిలవగలం అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచన చెయ్యడం జరిగిందన్నారు. ఆ దృక్పథం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి నట్లు మంత్రి వేణుగోపాల్ తెలిపారు. ఆ మేరకు నవంబర్ నెలాఖరు నాటికి ఖరీఫ్ సీజన్ కోతలు పూర్తి చేసి, డిసెంబర్ 1 నుంచి 10 లోగా రబీ సీజన్ నాట్ల కోసం రైతులను సంసిద్ధం చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు నాట్లు ప్రారంభించడం ద్వారా డిసెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చెయ్యడం సాధ్యం అవుతుంది అని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా పంట వేసిన వారిని ఏ విధంగా రబీ కి సిద్దం చెయ్యగలమో అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆమేరకు సమావేశంలో తీర్మానం చేశామన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కింద రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి నిలువ ఏ విధంగా ఉంచాలనే అంశం కూడా చర్చించి, ఆమేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రతిపాదించిన ట్లు మంత్రి వేణు పేర్కొన్నారు.

Also Read: Minister KTR : వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌

పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసి రైతుకు అన్ని విధాలా భరోసా ఇచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు తెలిపారు. ఆమేరకు శాసన సభ్యులు, రైతు లు, రైతు సంఘాల నాయకులు సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేసి నట్లు పేర్కొన్నారు. రబీ పంట పండిస్తామా ? లేదా? అనే ఆందోళనలో ఉన్న పత్రికల్లో కథనాలు, ప్రతి పక్షాల ఆరోపణలు పుల్ స్టాప్ పెడుతూ రైతులకు సకాలంలో సాగునీరు అందించడం దిశగా అడుగులు వేయడం జరిగింది. ఈమేరకు ముఖ్యమంత్రికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియ చేస్తున్నాము అని పేర్కొన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని, ఎవ్వరూ ఎన్ని విమర్శలు చేసినా, రైతుల పక్షాన నిలబడి పని చేస్తామని స్పష్టం చేశారు.

హోమ్ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ప్రతి ఒక్క నీటి బొట్టు వినియోగం చేసుకోవలసిన అవసరం ఉందని, ఆ క్రమంలో ప్రతి నియోజక వర్గ పరిధిలో ఆయకట్టు కు సాగు నీరు అందించే సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు.  గత సీజన్లో రైతులకు సకాలంలో సాగునీరు అందించగలిగామని, క్రమంలో రైతులు ఈ రబీ సీజన్లో ఆమేరకు సాగునీరు అందించాల్సి ఉంటుందన్నారు. బాధ్యత మనపై ఉందని హోం మంత్రి గుర్తు చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వ విధానంలో రైతు స్నేహ పూర్వక విధానం అమలు చేయడం జరుగుతోందని అన్నారు. రాబోయే రబీ సీజన్లో పూర్తి స్థాయిలో సాగు విస్తీర్ణం చేసేందుకు అవసరమైన నీటి వనరుల పంపిణీ చేయాల్సి ఉందన్నారు