Michelle Obama: అమెరికా అధ్యక్ష బరిలో ఒబామా భార్య ఉన్నారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఎవరు ఆమెను కలిసినా పోటీచేస్తున్నారా అన్న ప్రశ్నే ఎదురవుతోంది తనకు. ఈ ప్రశ్నే తన భర్త బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా తలెత్తింది. అప్పటినుంచి ఆమెను పలువురు ఇదే అడుగుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ఆమె ఈ విషయంపై నోరువిప్పింది. 2024లో జరుగబోవు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం జో బైడెన్ తనదైన మార్కు పాలనతో చక్కగా పాలిస్తున్నారని తెలిపారు. అలాగే బైడెన్ రెండో సారి అమెరికాకు అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అది బైడెన్, అతడి కుటుంబం ఆలోచించుకోవాల్సిన అంశమని.. పూర్తిగా బైడెన్ వ్యక్తిగతానికి సంబంధించిందన్నారు. అలాగే బైడెన్, జిల్ బైడెన్ ఏంచేయాలో చేయకూడదో ఆలోచించే మిలియన్లమంది వ్యక్తుల్లో ఒకరిగా తాను ఉండాలనుకోవడం లేదన్నారు. ఆమె బైడెన్ మళ్లీ అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారా అనే దానికి పూర్తి అంగీకారం తెలుపకుండా పరోక్షంగా చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పకనే చెప్పారు.
Read Also: Rahul Ganghi : బ్రిటీషర్లకు సావర్కర్ సాయం చేశాడు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు