అందం కోసం, ఉన్న అందాన్ని మరింత మెరుగు పరుచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సహజ చిట్కాలతో పాటు మార్కెట్ లో లభించే ఫేస్ వాష్ లను యూజ్ చేస్తుంటారు. అందంగా కనిపించేందుకు బ్యూటీపార్లర్లకు వెళుతుంటారు. అయితే మార్కెట్ లో లభించే ఫేస్ వాష్ లలో పలు రకాల కెమికల్స్ ఉండడంతో చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాటితో కొత్త అందం దేవుడెరుగు ఉన్న అందం ఊస్ట్ అవుతుంది.
Also Read:Mithun Reddy: ఈ కేసు రాజకీయ కక్షలతో పెట్టింది.. భయపడేది లేదు..
కాబట్టి ప్రకృతిలో లభించే చర్మ సంరక్షణ ఉత్పత్తులతో ఫేస్ వాష్ లను తయారు చేసుకుని వాడుకుంటే మీరు కోరుకున్న అందం మీ సొంతం అవుతుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చే ఆయుర్వేద ఫేస్ వాష్ లు ట్రై చేయమని నిపుణులు సూచిస్తున్నారు. మీ చర్మ రకాన్ని బట్టి ఈ నాలుగు ఫేస్ వాష్ పౌడర్లను ఉపయోగించుకోవచ్చని.. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చని.. ఈ పౌడర్లను సరైన రీతిలో ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లును టార్గెట్ చేస్తున్నారు.. ఏఎం రత్నం షాకింగ్ కామెంట్స్
ముల్తానీ మట్టి
ముల్తానీ మట్టి అనేది చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని తొలగించి అదనపు నూనెను పీల్చుకునే సహజమైన క్లెన్సర్. ఇది చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలను తగ్గిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ముల్తానీ మట్టి ఉత్తమమైన ఫేస్ వాష్.
శనగపిండి
శనగపిండి అనేది చర్మాన్ని పోషించే, ఎక్స్‌ఫోలియేట్ చేసే తేలికపాటి స్క్రబ్. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. శనగపిండిలో ప్రోటీన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
Also Read:Mohammad Azharuddin: మాజీ క్రికెటర్ భార్య బంగ్లాలో దొంగతనం.. నగదు, టీవీతో దొంగలు పరార్..!
మసూర్ దాల్ పౌడర్
మసూర్ పప్పు పొడి చర్మాన్ని కాంతివంతం చేసే సహజ ఏజెంట్. ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇది చర్మంపై మచ్చలను కూడా తగ్గించి పోషణనిస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి మసూర్ పప్పు పొడి ఉత్తమమైనది.
Also Read:TG Rains: రైతన్నలను కరుణించిన వరుణుడు.. మరో నాలుగు రోజులపాటు వానలే వానలు
గ్రీన్ మూంగ్ దాల్ పౌడర్
గ్రీన్ మూంగ్ దాల్ పౌడర్ అనేది సున్నితమైన చర్మం ఉన్నవారికి అనువైన సహజమైన, తేలికపాటి ఫేస్ వాష్. ఇది చర్మానికి పోషణనిస్తుంది. గ్రీన్ మూంగ్ దాల్ పౌడర్ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది.