Mithun Reddy: గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి సిట్ ఆఫీసుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు భారీ కాన్వాయ్ గా బయలుదేరి వచ్చారు. దీంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలను పోలీసులు నిలిపి వేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టింది.. ఈ కేసు ఒక తప్పుడు కేసు అని మండిపడ్డారు. ప్రస్తుతానికి వేధించి రాజకీయ ఆనందం పొందవచ్చు.. కానీ, ఇది నిలబడే కేసు కాదు.. ఈ కేసును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేస్తాం.. కేసులో ఏం సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అన్నారు. ఆధారాలు లేవని వాళ్లు చెబితే రేపే తీసి వేస్తారు.. అందుకే ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లును టార్గెట్ చేస్తున్నారు.. ఏఎం రత్నం షాకింగ్ కామెంట్స్
మరోవైపు, లిక్కర్ స్కామ్ కేసులో మరొకరి పేరు తాజాగా నిందితుడి పేరు సిట్ చేర్చింది. ఇప్పటి వరకు 40 మందిని నిందితులుగా అధికారులు చేర్చారు. ఇవాళ మరొకరిని నిందితుడుగా చేర్చుతూ సిట్ పిటిషన్ వేయనుంది. కాసేపట్లో ఏసీబీ కోర్టులో నిందితుడి పేరును చేర్చూతు మెమో వేయనున్నారు.